Vijay Deverakonda: ఫస్ట్ టైమ్ తండ్రీ కొడుకుగా విజయ్ దేవరకొండ?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. రౌడీ హీరోగా దూసుకుపోతున్న విజయ్.. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో ఫస్ట్ అలా కనిపించబోతున్నాడనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. ఇంతకీ ఏ సినిమాలో?
Vijay Deverakonda: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనేలా అదిరిపోయే సినిమాలు లైన్లో పెట్టాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. షూటింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన అప్టేట్స్ త్వరలోనే రానున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు.. రీసెంట్గా బర్త్ డే సందర్భంగా మరో రెండు కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేశాడు రౌడీ. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామా ఒకటి చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ‘టాక్సీవాలా’ తర్వాత ఈ క్రేజీ కాంబో సెట్ అవడమే కాదు.. ఈసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాని ఎత్తుకున్నారు విజయ్, రాహుల్.
ఇప్పటికే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 కాలంలో చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ మూవీలో విజయ్ దేవరకొండ డ్యుయల్ రోల్లో కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా తండ్రీకొడుకులుగా నటిస్తున్నట్లు టాక్ సమాచారం. ఇదే నిజమైతే.. విజయ్ తన కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటిస్తున్నట్లు టాక్. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.