MLC Mohammed Iqbal: ఎమ్మెల్సీ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా!
హిందూపురం వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పార్టీతో పాటు ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు, మండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖ పంపించారు.
MLC Mohammed Iqbal: ఎన్నికల సమయంలో వైసీపీకు గట్టి షాక్ తగిలింది. పార్టీలో ఉన్న ముఖ్య నేతలంతా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. హిందూపురం వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పార్టీతో పాటు ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు, మండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
మహ్మద్ ఇక్బాల్ ఆయన పదవి కాలం 2027 వరకు ఉన్నా.. పార్టీకి, పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో మహ్మద్ ఇక్బాల్ హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. ఇటీవల నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను తప్పించి దీపక అనే మహిళకు అప్పగించడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు సమాచారం.