Pm Modi: కాంగ్రెస్ పార్టీ ఇటీవల మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేనిఫెస్టోపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది కాంగ్రెస్ మేనిఫెస్టోలా లేదని.. ముస్లిం లీగ్ మేనిఫెస్టోలా ఉందని.. బుజ్జగింపు రాజకీయాల కోసమే రూపొందించినట్లుగా కనిపించిందన్నారు. అలాగే ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే ఇటీవల చేసిన వ్యాఖ్యలపైన కూడా మండిపడ్డారు. అసలు ఇన్నేళ్లు జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆర్టికల్ 370కి రాజస్థాన్‌కు ఏం సంబంధమని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు అన్నారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన బిహార్, రాజస్థాన్‌లకు చెందిన భద్రతా సిబ్బందిని అవమానించేలా ఆయన వ్యాఖ్యాలు ఉన్నాయని మోదీ అన్నారు. మరి బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని జమ్మూ కశ్మీర్లో ఎందుకు అమలు చేయలేదు? అది మోదీ ప్రభుత్వంలోనే సాధ్యమైందని ప్రధాని అన్నారు. ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాలేదు.. కాంగ్రెస్‌కు ఎందుకు అంత కోపమో అని మోదీ అన్నారు.