Chandrababu: ఫించను కోసం వెళ్లి చనిపోయిన వాళ్ల మరణాలు ప్రభుత్వ హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ వెంటనే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని, బాబాయ్‌ను చంపేసి మళ్లి దండేసి సానుభూతి పొందారని చంద్రబాబు అన్నారు. శవరాజకీయాలను వైసీపీ నేతలు మానుకోవాలన్నారు. పింఛన్ల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్లకు తప్పుడు సమాచారం ఇవ్వడం దారుణమన్నారు.
పింఛన్లపై జరుగుతున్న కుట్రలో అధికారులు కూడా భాగస్వాములు కావడం దుర్మార్గం. ఓడిపోతామని తెలిసి రూ.13వేల కోట్లు కాంట్రక్టర్లకు దోచిపెట్టారు. పింఛన్లు డోర్ డెలివరీ చేయవద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదన్నారు. నగదును ముందుగానే డ్రా చేసి పెట్టుకోవాలి కదా. వాలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని వైసీపీ ప్లాన్ చేసింది. మీ స్వార్థం కోసం ఇబ్బంది పెడతారా? వాళ్లపై కేసులు పెడితే ఉద్యోగాలు ఎలా వస్తాయి? మీ గెలుపు కోసం వాలంటీర్లను బలి పశువులను చేస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.