»Djb Row Sc Asks Delhi Principal Secretary Finance To Release Funds
Kejriwal : మూడు రోజుల్లో రెండో సారి సుప్రీం నుంచి కేజ్రీవాల్ కు గుడ్ న్యూస్
ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి మరో శుభవార్త అందింది. నీటి సరఫరా సంబంధిత సంస్థకు చెల్లించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆర్థిక శాఖ)ని సుప్రీంకోర్టు కోరింది.
Kejriwal : ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి మరో శుభవార్త అందింది. నీటి సరఫరా సంబంధిత సంస్థకు చెల్లించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆర్థిక శాఖ)ని సుప్రీంకోర్టు కోరింది. ఢిల్లీ జల్ బోర్డుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఇప్పుడు ఏప్రిల్ 10న జరగనుంది. అసెంబ్లీ ఆమోదించినప్పటికీ ఢిల్లీ జల్ బోర్డుకు కేటాయించిన నిధులను అధికారులు విడుదల చేయడం లేదని కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అంతకు ముందు.. అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని దాఖలైన పిటిషన్లపై విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం, ఆప్ నేతలు, ముఖ్యంగా కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. అరెస్టయి జైలుకు వెళ్లినా కేజ్రీవాల్ ఢిల్లీ పరిపాలనను జైలు నుంచే నిర్వహిస్తారని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లపై విచారణకు అంగీకరించని ఢిల్లీ హైకోర్టు.. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. దీంతో కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఆప్ కార్యకర్తల ఉత్కంఠకు తెరపడింది.