Pappu Yadav: రాజకీయాల్లో పప్పు యాదవ్ గురించి అందరికీ తెలిసిందే. చాలాసార్లు లోక్సభకు ప్రాతినిద్యం వహించారు. అయిన తనకు టికెట్ దక్కలేదని ఏడ్చేశారు. మాజీ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ పూర్నియ నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఆశించారు. ఇటీవల తన పార్టీ జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ప్రస్తుతం పప్పు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తర్వాత మద్దతుదారులతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. నాకు ఎందుకు టికెట్ ఇవ్వడానికి పదే పదే నిరాకరిస్తున్నారు. నాకేం తక్కువ అంటే ఉద్వేగంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆర్జేడీ అగ్రనేతలు లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్పై విమర్శలు చేశారు. తేజస్వి వెంటరాగా.. పూర్నియా స్థానానికి భీమా భారతి నామినేషన్ వేశారు. దీనిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేసేప్పుడు మీరిలా అభ్యర్థి వెంట ఎన్నడూ వెళ్లలేదు. కానీ నాకు వ్యతిరేకంగా పోటీ చేస్తోన్న అభ్యర్థి కోసం ఈసారి వచ్చారు. గత ఏడాది కాలంగా పూర్నియా కోసం పనిచేస్తున్న నాకు దక్కిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులు ఖరారు అయ్యారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పప్పూ యాదవ్ తమ పార్టీ పోటీదారు కాదని తెలిపింది. తమ మద్దతు ఆర్జేడీ అభ్యర్థికే అని స్పష్టం చేసింది. బిహార్లోని 40 లోక్సభ స్థానాల్లో తొమ్మిది సీట్లు హస్తం పార్టీకి దక్కాయి.