»Mlc Kavitha Cbi Petition Seeking Permission To Question Kavitha
MLC Kavitha: కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో ఉన్నారు. ఆమెను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఈ కేసు విషయంలో గతేడాది డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత ఇంట్లోనే సీబీఐ అధికారులు ఆమెను విచారించిన సంగతి తెలిసిందే.
మద్యం కేసులో కవితను గత నెల 15న ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. పది రోజుల పాటు కస్టడీకి తీసుకుని ఆమెను ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైలులో ఉన్నారు. ఈక్రమంలో దర్యాప్తులో భాగంగా మరోసారి కవితను ప్రశ్నించేందుకు ప్రత్యేక పిటిషన్ వేసి అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరడం ఆశ్చర్యం. దీనిపై కవిత తరపు న్యాయవాదులు రిప్లై దాఖలు చేయాల్సి ఉందది. సీబీఐ ఏయే అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమైంది, ఏ అంశాలను పొందుపరిచిందనే పిటిషన్ కాపీ తమ వద్దకు ఇంకా రాలేదని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే ఈ పిటిషన్పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.