ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇలా బరితెగించి మాట్లాడేవారు దాని ఫలితం అనుభవిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలకు, నేతలకు సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారని చంద్రబాబు తెలిపారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై కేసు నమోదైంది. నిన్న చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.
సీఎం జగన్ అయిదేళ్ల అరాచక పాలనతో జనం విసిగారని.. తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా అతనిని బంధించేందుకు నిర్ణయించుకున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
సాధారణంగా సీఎం తన పరిపాలనను ఏదైనా మంచి అభివృద్ధి కార్యక్రమంతోనే ప్రారంభిస్తారు. కానీ సీఎం జగన్ మాత్రం విధ్వంసంతో మొదలుపెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
బీఆర్‌ఎస్‌కు ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి సీఎం జగన్ నివాళులర్పించారు. తర్వాత ఆయన సమక్షంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు.
సొంత టీవీ ఛానళ్లు కలిగిన రాజకీయ పార్టీల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు చేసే ప్రచారాలను కూడా ఎన్నికల వ్యయంలో భాగంగా లెక్కగడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఈఓ ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి పలు మార్గదర్శకాలను ప్రకటించారు.
గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.