YS Sharmila: వైఎస్ షర్మిల సీఎం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ నిర్వహించారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ.. జగన్పై మండిపడ్డారు. చిన్నాన్న మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతాయేనని అన్నారు. సీఎం జగన్ ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదని షర్మిల వ్యాఖ్యానించారు. హంతకులు ఎవరో కాదు.. బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయన్నారు.
బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా.. ఇంకా ఆరోపణలు చేస్తారా? ఐదేళ్లు అవుతున్న హత్యచేసిన, చేయించిన వాళ్లకు ఇప్పటివరకు శిక్ష పడలేదు. చివరి క్షణం వరకు చిన్నాన్న వైసీపీ కోసమే పనిచేశారు. సాక్షిలో పైన వైఎస్ ఫొటో.. కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం. జగనన్నా అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండని షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? ఆయన వారసుడిగా మీరేం చేశారని షర్మిల జగన్ను నిలదీశారు.