Hero Venkatesh's second daughter got married.. Namrata's post is viral
Namrata: ప్రముఖ హీరో వెంకటేశ్ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన రెండో కుమార్తె హయ వాహిని వివాహం జరుగుతుంది. ఈ వేడుకకు చాలా మంది సినీ, రాజకీయ ప్రముకులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోథ్కర్, తన కూతురు సితార పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ ఫ్యామిలీకి సంబంధించి ఏ వేడుకలు అయినా పెద్దగా మీడియా అటెన్షన్ ఉండదు. అందుకే చాలా మంది ఈ ఫోటోలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ అభిమాన హీరో వెంకటేష్ కూతురి వివాహానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
గత సంవత్సరం అక్టోబర్‌లో హయ వాహిని నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు పెళ్లికి కూడా టాలీవుడ్ ప్రముఖుల అందరికి ఆహ్వానాలు అందాయి. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో నేడు వివాహం జరగనుంది. రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా వివాహాం జరగనుంది. 2019లో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత వివాహం జరిగింది.