»Nara Lokesh Jagans Thirst For Blood Increases As It Gets Closer To The Party
Nara Lokesh: జగన్ పార్టీకి పోయేకాలం దగ్గర పడే కొద్దీ రక్త దాహం పెరిగిపోతుంది
సాధారణంగా సీఎం తన పరిపాలనను ఏదైనా మంచి అభివృద్ధి కార్యక్రమంతోనే ప్రారంభిస్తారు. కానీ సీఎం జగన్ మాత్రం విధ్వంసంతో మొదలుపెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
Nara Lokesh: సాధారణంగా సీఎం తన పరిపాలనను ఏదైనా మంచి అభివృద్ధి కార్యక్రమంతోనే ప్రారంభిస్తారు. కానీ సీఎం జగన్ మాత్రం విధ్వంసంతో మొదలుపెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పాలనలో ప్రజలు ఐదేళ్లు నరకం అనుభవించారన్నారు. కుప్పం నియోజకవర్గంతో పోటీపడేలా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
రాష్ట్రమంతా గంజాయిని విస్తరించిన వాళ్లను జగన్ తన పక్కన పెట్టుకున్నారని లోకేష్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే గంజాయిని నివారిస్తామన్నారు. జగన్ పార్టీకి పోయేకాలం దగ్గర పడుతున్న కొద్దీ రక్త దాహం మరింత పెరిగిపోయిందని లోకేశ్ అన్నారు. ఓటమి భయంతో టీడీపీ కార్యకర్త మునయ్యను వైసీపీ వాళ్లు చంపేశారు. టీడీపీలో చేరిన రోజే చంపిస్తేమని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదన్నారు. జగన్కు ఆయన సైన్యానికి ఇక ఇవే ఆఖరి రోజులని లోకేశ్ అన్నారు.