tdp not contested in telangana assembly elections 2023
TDP Candidates Third List: తెలుగు దేశం పార్టీ నేడు అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. వచ్చే లోక్సభ, శాసన సభ ఎన్నికల్లో ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారన్న విషయంపై ఇప్పటి వరకు కొన్ని స్థానాలు పెండింగులో ఉన్నాయి. ఇప్పుడు అభ్యర్థుల పేర్లతో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో మొత్తం 11 శాసన సభ స్థానాలు, 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల (CANDIDATES) పేర్లను వెల్లడించింది. ఇంకా ఐదు అసెంబ్లీ, నాలుగు ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.
పలాస నియోజకవర్గం నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవింద్ రావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపు కోట నుంచి కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి అయితాబత్తుల ఆనందరావు, పెనమలూరు(ఎస్సీ) నుంచి బోడె ప్రసాద్, మైలవరం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నరసరావుపేట నుంచి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, చీరాల నుంచి మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిలు అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు టీడీపీ వెల్లడించింది.
అలాగే 13 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులనూ(MP CANDIDATES) తెలుగుదేశం పార్టీ(TDP) ప్రకటించింది. శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్, అమలాపురం – గంటి హరీష్ మాధుర్, ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ – కేశినేని శివనాధ్, గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాపట్ల – టి. కృష్ణ ప్రాద్, నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, చిత్తూరు -దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు – బస్తిపాటి నాగరాజు, నంద్యాల -బైరెడ్డి శబరి, హిందూపూర్ – బీకే పార్ధసారధిలు పోటీలో నిలబడనున్నారు.