Harish Rao: అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు. ఇలా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత మూడు రోజుల నుంచి ఈదురుగాలులు, వడగళ్ల వాన కురుస్తోందని.. అయిన ప్రభుత్వం స్పందించలేదని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారుకు కేవలం రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు పట్టడం లేదన్నారు.
గతంలో అకాల వర్షాలకు రైతులు నష్టపోతే అప్పటి సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఇచ్చారు. వడగళ్ల వానతో ఆదిలాబాద్, నిజమాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో పంట నష్టం అంచనా వేయాలి. వర్షంతో వరి, మొక్కజొన్నతో పాటు మామిడి సహా మరికొన్న ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి. ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.