»Baba Ramdev Supreme Court Summons To Baba Ramdev Because
Baba Ramdev: బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు సమన్లు.. ఎందుకంటే?
బాబా రాందేవ్కు మంగళవారం సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. అతనితో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విషయంలో పిటిషన్పై సమాధానం ఇవ్వకపోవడంతో ఈ సమన్లు ఇచ్చింది.
Baba Ramdev: బాబా రాందేవ్కు మంగళవారం సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. అతనితో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విషయంలో పిటిషన్పై సమాధానం ఇవ్వకపోవడంతో ఈ సమన్లు ఇచ్చింది. ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్లో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వద్దని సూచించింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇకపై అలాంటివి జరగవని సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఆ హామీని ఉల్లంఘించడంపై గత నెల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై ఎందుక చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రాందేవ్ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ప్రకటనల విషయంలోనూ కొన్ని సూచనలు చేసింది. అయితే ఈ నోటీసులకు పతంజలి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. దీంతో మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టీస్ అమనుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరూ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.