Patanjali: Baba Ramdev apologized.. Supreme once again angered Patanjali!
Patanjali: ప్రముఖ ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌పై సుప్రీం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రాందేవ్, పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మరోసారి బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వడం రెండోసారి. సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో క్రితం రోజుతో పోలిస్తే మరింత పెద్ద పరిమాణంలో క్షమాపణల ప్రకటనలు ఇచ్చింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో బహిరంగ క్షమాపణలు కోరుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి కంపెనీ నిన్న సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశవ్యాప్తంగా 67 పత్రికల్లోఆ ప్రకటనలు ఇచ్చారని తెలిపారు.
ఇది కూడా చూడండి: Inside car: కారులో కచ్చితంగా ఉంచుకోవాల్సిన వస్తువులు ఇవే!
ధర్మాసనం స్పందిస్తూ.. క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో మీ ఉత్పత్తుల ప్రకటనలో ఉపయోగించిన ఫాంట్ సైజునే వాడారా? అంతే పరిమాణంలో క్షమాపణలను ప్రచురించారా? అని ప్రశ్నించారు. దీంతో బహిరంగ క్షమాపణలను పెద్ద సైజులో మరోసారి ప్రచురిస్తామని సంస్థ తరపున న్యాయవాది తెలిపారు. ఈ కేసులో తర్వాత విచారణను ధర్మాసనం ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది. పతంజలి కోర్టు ధిక్కార అంశాన్ని అప్పుడే విచారిస్తామని తెలిపింది. పత్రికల్లో వచ్చిన బహిరంగ క్షమాపణల ప్రకటనల వివరాలను రెండు రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఇది కూడా చూడండి: holidays : వేసవి సెలవుల్లో పిల్లలతో ఈ విషయాల్లో జాగ్రత్త!

