holidays : వేసవి సెలవుల్లో పిల్లలతో ఈ విషయాల్లో జాగ్రత్త!
పిల్లలకు వేసవి సెలవులు మొదలయ్యాయి. స్కూళ్ల నుంచి ఖాళీ దొరికి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఈ సమయంలో వీరితో ఏం చేయించవచ్చు. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? తెలుసుకుందాం రండి.
Summer holidays : పిల్లల స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారనగానే చాలా మంది తల్లిదండ్రులు భయపడిపోతుంటారు. వారిని కంట్రోల్ చెయ్యడం కష్టంగా ఉంటుందని చెబుతుంటారు. అయితే వేసవి కాలంలో వారిని ఎలా మ్యానేజ్ చెయ్యాలి? అన్న విషయంలో కాస్త అవగాహన పెంచుకోవాలి. ఈ సమయంలో వారితో ఏం చేయించాలి? వేటికి దూరంగా ఉంచాలి? లాంటి వాటిపై దృష్టి సారించాలి.
ఎండ వేడిమిలో ఆటలు ఆడటాన్ని నిరోధించండి. వడ దెబ్బ తగలడం ప్రాంణాంతకమైన విషయం అని పిల్లలకు తెలియదు. కాబట్టి వారికి ఈ విషయంపై అవగాహన కలిగించండి. అలాగే ఎక్కువ నీటిని తాగేలా చూడండి. వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం ఎంతో అవసరం. ఇంట్లో ఉంటే కొంత మంది పిల్లలు(Children) ఎక్కువ సేపు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు చూడటానికి చూస్తుంటారు. వాటికంటూ కొంత సమయాన్ని కేటాయించండి. అంత సేపు మాత్రమే వాటిని చూడనివ్వండి. అంతకంటే ఎక్కువ సేపు చూడనివ్వకండి.
వేసవి సెలవుల్లో(Summer holidays) పిల్లల క్రియేటివిటీని పెంచే యాక్టివిటీలకు ప్రాధాన్యం ఇవ్వండి. మైండ్ గేమ్స్, పజిల్స్, పెయింటింగ్స్, హ్యాండ్ రైటింగ్ లాంటివి ప్రాక్టీస్ చేసేలా వారిని ప్రోత్సహించండి. కొంచెం సేపు పుస్తకాలతోనూ సావాసం చేయనియ్యండి. కథల పుస్తకాల్లాంటి వాటిని వారికి చదువుకోవడానికి అందుబాటులో ఉంచండి. అలాగే అగ్గిపెట్టెలు, లైటర్లు, మందు సీసాల్లాంటి వాటిని వారికి అందనీయకుండా ఎత్తులో ఉంచే ప్రయత్నం చేయండి. అలాగే ఎదిగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇంటరాక్టివ్‌గా ఉండటం అనేది ఎంతో అవసరం. ఇప్పుడు వారు చదువుల్లేకుండా ఉంటారు కాబట్టి వారితో ఎక్కువ సమయం గడిపేందుకు, వీలైనన్ని ఎక్కువ విషయాలపై వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నించండి.