»Patanjali Made It Clear To The Supreme Court That The Product Had Been Stopped
Supreme Court: ఆ ఉత్పత్తులను నిలిపివేసినట్లు సుప్రీంకోర్టుకు పతంజలి స్పష్టత
పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించిన మొత్తం 14 రకాల ఉత్పత్తులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పతంజలి స్పందించింది.
Patanjali made it clear to the Supreme Court that the product had been stopped
Supreme Court: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు పతంజలి సంస్థ స్పందించింది. వెంటనే ఉన్నత న్యాయస్థానం బ్యాన్ చేసిన 14 రకాల ప్రోడక్టుల అమ్మకాలను నిలిపివేసినట్లు కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. పతంజలి ఆయుర్వేద సంస్థ, వాటి ఫ్రాంచైజీలు, దాని అనుబంధ సంస్థల స్టోర్లలో ఉన్న ఆ నిషేధిత ప్రోడక్టులను వెనక్కి పంపాలని కోరినట్లు కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఆ ప్రొడక్టులకు సంబంధించిన ప్రచారాలు వెంటనే నిలిపివేయాలని డిజిటల్, టీవీ మార్కెటింగ్ సంస్థలకు చెప్పినట్లు తెలిపింది. మొత్తం పతంజలికి సంబంధించి తయారి వస్తువులలో 14 రకాల వాటిని నిషేధించింది. ముఖ్యంగా కరోనా కాలంలో పతంజలి తీసుకొచ్చిన ఔషదం పెద్ద దుమారమే లేపింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పతంజలి వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి అని తెలిసిన తరువాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిరీయస్‌గా పతజంలి సంస్థపై చర్యలు తీసుకుంది. పతంజలి ఆయుర్వేద సంస్థ, దాని అనుబంధ సంస్థ దివ్వ ఫార్మసీ ఉత్పత్తులకు సంబంధించిన 14 రకాల ఉత్పత్తులను బ్యాన్ చేసింది. ఇప్పటికే పలు సార్లు ఉన్నత న్యాయస్థానంలో పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ, బాబా రామ్‌దేవ్ సుప్రీంకోర్టులో హాజరయ్యారు. ఆ కేసు విచారణ కొనసాగుతుంది.