»Congress A Shock To Brs Mp And Mla Joined Congress
Congress: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి చేరిన ఎంపీ, ఎమ్మెల్యే!
బీఆర్ఎస్కు ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
Congress: బీఆర్ఎస్కు ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఈ రోజు ఉదయం పార్టీకి రాజీనామా చేశారు. చేవెళ్ల ప్రజలకు సేవచేసే అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.