MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఎదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కవిత చిన్న కుమారుడికి పరీక్షలు ఉండటం వల్ల ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 4న రిజర్వ్ చేసింది. వాదనల సమయంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది.
కవితకు బెయిల్ ఇస్తే కేసు సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. అఫ్రూవర్‌గా మారిన కొందరిని ఇదివరకే ఆమె బెదిరించారని.. ఆ ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని ఈడీ కోరింది. ఈక్రమంలో కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20న విచారణ జరపనుంది.