Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖరారైంది. గత మూడు రోజులుగా పార్టీ నాయకుల మధ్య జరిగిన చర్చలు సంతృప్తికరంగా ముగిసాయి. పొత్తులో భాగంగా 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, రెండు లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నాయి. అదేవిధంగా 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. మిగతా 145 అసెంబ్లీ స్థానాలు , 17 పార్లమెంట్ స్థానాలకు టీడీపీ పోటీ ఖరారయ్యింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటి చేయనున్నారు.
కాకినాడ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పవన్ ఈ స్థానాన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. శనివారం మలి విడతగా కేంద్రమంత్రి అమిత్ షా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన నేత పవన్‌కల్యాణ్ మధ్య జరిగిన చర్చలు కొలికివచ్చాయి. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో అన్న అంశంపై క్లారిటీ కూడా వచ్చినట్లు సమాచారం. అయితే అంతకుముందు ఎంపీగా, ఎమ్మెల్యేగా రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిన పవన్ బీజేపీ పెద్దల సూచనతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది.