ఆ కుర్చీని మడత పెట్టి.. ఈ డైలాగ్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆ డైలాగ్ వినపడుతోంది. అయితే ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ నోట వినబడితే ఎలా ఉంటుందో అని చాలామంది అనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2022లో నిరసనకు సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలపై చర్యలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది గాలివాటం గెలుపని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల బీఆర్‌ఎస్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు ఉదయం సింహాచలం వెళ్లి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. తర్వాత నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో మాట్లాడారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బీజేపీలో చేరనున్నరని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కమల్‌నాథ్ బీజేపీలో చేరే ప్రసక్తి లేదని.. దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. నీటిపారుదల రంగంపై విపక్షాలు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేశాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
టీడీపీ నుంచి వైసీపీకు వెళ్లిన కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ పశ్చిమంలో తెలుగుదేశం టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర డబ్బులు వసూలు చేశారన్నారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ సభలో మాట్లాడుతూ.. టీడీపీ, జనసైనికుల జోలికి వైసీపీ నేతలు వస్తే ఊరుకునేది లేదన్నారు.
ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. నిరుద్యోగులు అధైర్య పడవద్దు.. మీ సమస్యలు మేం పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.