Ali: వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ మాట్లాడారు. రాజమండ్రిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ తో కలిసి అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందా అని అడగగా…ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని, వైస్సార్ సీపీ ఆదేశిస్తే..వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేనన్నారు. అయితే ఈ వారంలో సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చే చాన్స్ ఉందని, అధిష్టానం మేరకే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈ స్థానం నుండి పోటీ అని ఏం లేదని, గుంటూరు, రాజమండ్రి, నంద్యాల ఏ స్థానం నుంచైనా పోటీకి సిద్ధమని చెప్పారు. ఇక తాజాగా జరిగిన రాప్తాడు సభ చూసిన తరువాత వైఎస్సార్సీపీ విజయం ఖాయమని అర్థమైపోయిందని చెప్పారు.
ఇక రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో…ఎవరు ఎక్కడనుంచి ఐనా పోటీ చేయొచ్చు అన్నారు. ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొత్తుల పెట్టుకోవడం సహజమేనని, ఎవరు ఎంతమందితో ఎన్ని పొత్తులు పెట్టుకున్న అంతిమ విజయం మాత్రం ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. ఇటు సినిమాలు చేస్తూ..గొప్ప ఆర్టిస్ట్ గా, కమిడియన్ గా పేరు సంసాదించుకున్న అలీకి ప్రజల్లోకి వెళ్లాలని, రాజకీయపరంగా ముందుకు సాగలని గట్టి కోరక ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. కానీ పోటీ చేసే ఛాన్స్ రాలేదు. ఈ సారి సీఎం జగన్ అవకాశం కల్పిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. దానిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక వైసీపీ వర్గాలు కూడా ఎంపీ సీటు కేటాయించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఓ మైనార్టీకి చాన్సివ్వాలని అనుకుంటున్న జగన్..అలీకి అవకాశం ఇస్తారో..లేదో మరి చూడాలి.