MLA RK: ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆమెకు షాక్ ఇచ్చారు. వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి మళ్లీ ఆయన వైసీపీలోకి చేరనున్నట్లు సమాచారం. ఈరోజు ఆర్కే తాడేపళ్లిలో ముఖ్యమంత్రి జగన్తో భేటీ కానున్నారు. మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యతలు ఆయనకు అప్పగించనున్నట్లు సమాచారం.
అయితే పార్టీని మళ్లీ పైకి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్న పీసీసీ చీఫ్ షర్మిలకు ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఆర్కే కాంగ్రెస్లోకి చేరారు. పార్టీలో చేరిన మొదటి రోజు సాయంత్రం కీలక సమావేశం జరిగింది. ఆ భేటీకి ఆర్కేను పిలువలేదు. కనీసం లోపలికైనా పిలుస్తారని చాలా సమయం ఆర్కే గేటు వద్దే వేచి చూశారు. చివరికి కోపంతో వెళ్లిపోయినట్లు సమాచారం.