»Ktr Congress Is Trying To Turn Telangana Into A Desert Once Again
KTR: కాంగ్రెస్ తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చడానికి ప్రయత్నిస్తోంది
కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరచి రాజకీయాలు చేస్తోందని మేడిగడ్డ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు.
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరచి రాజకీయాలు చేస్తోందని మేడిగడ్డ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మీద ఉండే కోపాన్ని రైతుల మీద చూపించవద్దని కేటీఆర్ అన్నారు. ఎండుతున్న పంటలకు తక్షణమే నీరందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ప్రయోజనం కాదు.. రాజకీయ ప్రయోజనమే కాంగ్రెస్‌కి కావాలని కేటీఆర్ విమర్శించారు. అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామన్నారు. మరమ్మతులు చేయడానికి ఇబ్బంది ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
🔷 బాధ్యత మరచి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది
🔷 వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మేడిగడ్డ పర్యటన
🔷 రైతు ప్రయోజనం ముఖ్యం కాదు రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలి
🔷 ఇవ్వాళ చేస్తున్న పర్యటన మొదటి పర్యటన మాత్రమే.. తర్వాత అన్ని ప్రాజెక్టు లు పర్యటిస్తాం
బాధ్యులపై చర్యలు తీసుకోండి.. అంతేకానీ రైతులను బలి చేయొద్దని సూచించారు. రిపేర్ చేయకుంటే వర్షాకాలంలో బ్యారేజ్ కొట్టుకుపోతుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరిగినట్లు.. లేనిది ఉన్నట్టు చూపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి. మేడిగడ్డ ఆనకట్టలోని 84 పిల్లర్లలో 3 మాత్రమే కుంగాయి. లోపాలను సవరించాలి కానీ.. రాజకీయం చేయొద్దు. రాజకీయం చేసేందుకు మేడిగడ్డను వాడుకుంటున్నారని పోచారం విమర్శించారు.