Chandrababu: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు. ప్రజాసేవకు ఆయన మారుపేరు అన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వగతిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ప్రశ్నించిన వాళ్లను వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారు. ఈసారి ఓడిపోవడానికి జగన్ సిద్ధం. ఆయన రారాజు అనుకుంటున్నారు. ఎవరైనా ఆయన్ను వ్యతిరేకించినా, చేసింది తప్పని చెప్పినా ఇక వాళ్ల పని అయిపోయినట్లే అని తెలిపారు. అలా ప్రశ్నించడం వల్లే సొంత పార్టీ నేతలకు సైతం వేధింపులు తప్పలేదు. సీఎం జగన్ తీసు చూస్తే చాలా బాధేస్తుంది.
వ్యక్తులు, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చే పార్టీ టీడీపీ. అహంకారంతో ఇష్టానుసారం రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందని.. ఆ బాధ్యత మన అందరిపైనా ఉందని చంద్రబాబు అన్నారు. ఇది ఏ ఒక్కరి కోసమో కాదు. ఐదు కోట్ల ప్రజానీకం, భావితరాల భవిష్యత్తు కోసం జగన్ను గద్దె దించాలి. రాష్ట్రం, ప్రజలపై ఎలాంటి గౌరవం లేని వ్యక్తి సీఎంగా ఉండేందుకే ఏమాత్రం అర్హత లేదు. ఆయన విధానాలు నచ్చక వాళ్ల నేతలే పార్టీకి బైబై అంటున్నారు. కార్యకర్తలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ ముఖ్యమంత్రికి భంగపాటు తప్పదు. వెయ్యి శాతం చెబుతున్నా.. రాష్ట్రంలో రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే.