»Interim Unity Govt Common Voter List Law Panel Readies Report On Simultaneous Polls
Polls : 2029 నుంచి జమిలి ఎన్నికలకు లాకమిషన్ సిఫారసు
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. లా కమిషన్ 2029 నుంచి జమిలి ఎన్నికలు జరిగేలా రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేర్చాలని సిఫారసు చేసింది.
Simultaneous Polls In India: మళ్లీ ఐదేళ్ల తర్వాత జరగబోయే లోక్ సభ ఎన్నికలప్పటి నుంచి జమిలి ఎన్నికలనే జరిపేందుకు కేంద్రం వేగంగా పాములు కదుపుతోంది. ఈ విషయంపై లా కమిషన్ సానుకూల సిఫారసులు చేసింది. కేంద్ర రాష్ట్రాలకు కలిపి ఒక్కసారే ఎన్నికలు జరిపేలా రాజ్యాంగంలో కొత్త చాప్టర్ని చేర్చాలని లా కమిషన్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సార్వత్రిక ఎన్నికలు, జమిలి ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర లోక్ సభ స్థానాలతో పాటు రాష్ట్రాల శాసన సభ స్థానాలకు ఏక కాలంలో ఎన్నికలు జరిగితే బాగుంటుందని లా కమిషన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
జమిలి ఎన్నికల(Jamili Elections) కోసం రాజ్యాంగంలో ఒక చాప్టర్ ఉండాలని లోక్ సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు అన్నింటికీ సరిపోయేలా ఒకటే ఓటర్ల జాబితా(common voter list) ఉండాలని లా కమిషన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో జమిలి ఎన్నికలకు వీలుగా రాష్ట్రాల అసెంబ్లీ గడువును మూడు దశల్లో సర్దుబాటు చేయాలని చెప్పినట్లు సమాచారం.
ఇలా దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగే పెద్ద ఎత్తున ఈవీఎంలు అవసరం పడతాయి. అందుకు ప్రతి 15 ఏళ్లకు ఒకసారి రూ.10 వేల కోట్ల ఖర్చు అవుతుందని ఈసీ అంచనా వేస్తోంది. దీంతో దీని సాధ్యాసాధ్యాలపై మరింత కూలంకషంగా చర్చలు జరిపి కేంద్రం, లా కమిషన్(Law Commission), ఈసీలు కలిపి నిర్ణయాన్ని తీసుకోనున్నాయని తెలుస్తోంది.