PM Modi: In the first 100 days of coming to power, we will bring a law on Jamili elections!
PM Modi: 2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మోదీ తెలిపారు. దీన్ని సాధించడానికి ఏం చేయడానికైనా వెనుకాడనని మోదీ తెలిపారు. నేను కేవలం కార్యసాధకుడిని మాత్రమే.. ఎవర్ని ఎక్కడ ఉండాలో? ఏమవ్వాలో నిర్ణయించేది దేశ ప్రజలే అని తెలిపాు. బ్రాండ్ మోదీ అనే పేరు సాధించేందుకు నేను ప్రత్యేకంగా ఏం చేయలేదు. రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రజా జీవితంలో ప్రజల్లో నేను చూపిన విశ్వాసం ఫలితమే ఆ పేరు అన్నారు. వాళ్ల జీవితాలను బాగు చేసేందుకు నేను చేస్తున్న నిస్వార్థ సేవ, నిరంతర ప్రయత్నాలు వాళ్లు ప్రత్యక్షంగా చూస్తున్నారు. నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయి.
ఇప్పటివరకు చెడు ఉద్దేశంతో నేనేదీ చేయలేదని మోదీ తెలిపారు. అయితే అధికారం వచ్చిన మొదటి 100 రోజుల్లో యూసీసీ, ఒకే దేశం-ఒకే ఎన్నికపై చట్టం తీసుకొస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ఈ రెండు బీజేపీ మేనిఫెస్టోలో భాగమే. ఇచ్చిన హామీలను మేం తప్పకుండా నెరవేరుస్తాం. అధికారం చేపట్టాక తొలి 100 రోజుల్లో అమలు చేయాల్సిన ప్రణాళికను ముందే నిర్ణయించుకోవడం నాకు సీఎంగా ఉన్నప్పటి నుంచే అలవాటు. కేంద్రంలోనూ గత రెండుసార్లు అలాగే చేశా. మూడోసారి అధికారంలోకి వచ్చాక దీనికి మరో 25 రోజులు అదనంగా చేర్చాలనుకుంటున్నాం. ఈసారి 125 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని మోదీ తెలిపారు.