»Nepal Prime Minister Pushpa Kamal Dahal Wins Vote Of Confidence In Parliament
Nepal : విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్ ప్రధాని ప్రచండ.. 157మంది సభ్యుల మద్దతు
నేపాల్లో రాజకీయ అస్థిరత నెలకొంది. ప్రస్తుతం నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ. అయితే ఆయన ఈ పదవిలో ఎంతకాలం కొనసాగుతారనేది చెప్పడం కష్టం. ఆయన ప్రభుత్వంపై పదే పదే అవిశ్వాస తీర్మానం పెట్టడమే ఇందుకు కారణం.
Nepal : నేపాల్లో రాజకీయ అస్థిరత నెలకొంది. ప్రస్తుతం నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ. అయితే ఆయన ఈ పదవిలో ఎంతకాలం కొనసాగుతారనేది చెప్పడం కష్టం. ఆయన ప్రభుత్వంపై పదే పదే అవిశ్వాస తీర్మానం పెట్టడమే ఇందుకు కారణం. ప్రచండ పార్లమెంటులో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) నాయకుడు ప్రచండ 18 నెలల్లోనే నాలుగోసారి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.
సోమవారం విశ్వాస తీర్మానంపై నేపాల్లోని 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో ప్రచండకు 157 మంది సభ్యుల మద్దతు లభించింది. CPN (మావోయిస్ట్ సెంటర్) ప్రతినిధుల సభలో మూడవ అతిపెద్ద పార్టీ. ఆయనకు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు కూడా లభించింది. మొత్తం 158 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ ఓటింగ్ ప్రక్రియను బహిష్కరించింది. ఒక సభ్యుడు ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన జనతా సమాజ్వాదీ పార్టీ (జెఎస్పి) గత వారం సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగిన తర్వాత ఓటింగ్ జరిగింది.
పుష్ప కమల్ దహల్ డిసెంబర్ 2022లో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఆయన సభలో విశ్వాస పరీక్ష నెగ్గడం ఇది నాలుగోసారి. ప్రచండ నేపాలీ కాంగ్రెస్ నుండి విడిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. నేపాల్ రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా మిత్రపక్షం పాలక కూటమికి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ప్రధానమంత్రి విశ్వాసం కోరాలి. సోమవారం నేపాలీ పార్లమెంటులో విశ్వాస ఓటుపై ఓటింగ్ జరిగింది.