»Komatireddy Venkatareddy Brs Will Not Get A Single Seat In The Lok Sabha Elections
Komatireddy Venkatareddy: లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని తెలిపారు.
Komatireddy Venkatareddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని తెలిపారు. ఒకటో తారీఖున ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నామన్నారు. గ్రూప్-1, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చామని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రచిస్తున్నమని తెలిపారు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం విషయంలో మార్పులు, చేర్పులు కూడా ఉంటాయన్నారు.
ఎవరికీ ఇబ్బంది లేకుండా దాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రతిష్ఠ తగ్గిందని.. లోక్సభ ఎన్నికల్లో వాళ్లకు ఒక్క సీటు కూడా రాదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాలేదు. ఆ పార్టీలోని వాళ్లంతా రాజీనామా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 13-14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది. తెలంగాణ నుంచి ఆయన పోటీ చేస్తే ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారని కోమటిరెడ్డి అన్నారు.