Atchannaidu: సీఎం జగన్కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.
Atchannaidu: టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని బహిరంగ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. సురక్షిత నీరు అందక రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. గుంటూరులో కలుషిత జలంతో డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పటికే డయేరియాతో నలుగురు మృతి చెందారని.. మరో ముగ్గురికి కలరా వ్యాధి కూడా సోకిందని తెలిపారు. ముఖ్యమంత్రికి సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని.. ఇది బాధాకరమని అచ్చెన్నాయుడు అన్నారు. అధికారంలో ఉండే ఈ నెల రోజులైనా ప్రజల గురించి ఆలోచించాలని కోరారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు సురక్షిత నీరు అందించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని లేఖలో పేర్కొన్నారు.