AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రానికి వెళ్లనున్నారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో దుర్గమ్మను దర్శించుకుని శుద్ధి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ప్రాయశ్చిత దీక్ష తీసుకున్న పవన్.. 11 రోజుల పాటు ఈ దీక్షలో ఉండనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం దీక్ష విరమించనున్నారు.