CBI enquiry కావాలి.. సిట్ కాదు, పేపర్ లీకేజీపై రేవంత్ రెడ్డి
Revanth reddy:తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ పీఎస్సీ (tspsc) పేపర్ లీకేజీ అంశం ప్రకంపనలు రేపుతోంది. ఒకే ఊరిలో ఎక్కువ మందికి గ్రూప్-1లో 100కు పైగా మార్కులు వచ్చాయని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సిట్ (sit) నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు హైదరాబాద్ హిమాయత్ నగర్లో గల సిట్ ఆఫీసుకు వచ్చారు.
Revanth reddy:తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ పీఎస్సీ (tspsc) పేపర్ లీకేజీ అంశం ప్రకంపనలు రేపుతోంది. ఒకే ఊరిలో ఎక్కువ మందికి గ్రూప్-1లో 100కు పైగా మార్కులు వచ్చాయని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సిట్ (sit) నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు హైదరాబాద్ హిమాయత్ నగర్లో గల సిట్ ఆఫీసుకు వచ్చారు.
పేపర్ లీకేజీ (paper leak) అంశంపై చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నానని రేవంత్ రెడ్డి (revanth reddy) తెలిపారు. సిట్ (sit) కాదు.. సీబీఐ (cbi) చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ (ts psc) అక్రమాల పుట్ట అని తేలిపోయిందని చెప్పారు. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీక్ కావని ప్రజలు కూడా అర్థమయ్యిందని అన్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ (kcr)- కేటీఆర్ (ktr) అండ్ కో నియమించిన సిట్ (sit) విచారణను తనను పిలిచిందని ట్వీట్లో రాశారు. తప్పును చెప్పడమే నేరమా? అని రేవంత్ (revanth) అడిగారు. వెనక్కి తగ్గేదే లేదన్నారు. పేపర్ లీకేజీ అంశంపై సీబీఐ (cbi) లేదంటే సిట్టింగ్ జడ్జీ (sitting judge) చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా అని స్పష్టంచేశారు.
పేపర్ లీకేజీ అంశంలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ (praveen) 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) కమిషన్‌లో చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) పరిచయం పెంచుకునేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడని తెలిసింది. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నారని సమాచారం. 40 మంది మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ మహిళలను ఒత్తిడి చేశాడని తెలిసింది. మరొకరు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని ఇటీవల మంత్రి కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
సిట్ కాదు… సీబీఐ విచారణ కావాల్సిందే
టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది.
ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ – కేటీఆర్ అండ్ కో నియమించిన “సిట్” విచారణకు పిలిచింది. తప్పును ఎత్తి చూపడమే… pic.twitter.com/8XFq7HNSdu