»These 5 Lifestyle Habits Are The Reason For Your Old Look
Health Tips: చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలున్నాయా? కారణాలివే
ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) అశ్రద్ధ చేస్తున్నారు. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు(Food Habits) ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఉద్యోగ బాధ్యతలు, ఒత్తిడి(Stress), బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఇంకొందరు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసలుగా మారి శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చెడు అలవాట్లు(Bad Habits) ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడతాయి. వీటి వల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య సమస్యలు అనేవి వస్తాయి. ముఖ్యంగా చర్మం(Skin), జుట్టు(Hair)పై ప్రతికూల ప్రభావం అనేవి చూపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

నేటి రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్య(Problem)లతో బాధపడుతున్నారు. చిన్న చిన్న పనులు చేస్తేనే నీరసించిపోతున్నారు. వీరిలో ఏకాగ్రత అనేది అస్సలు ఉండదు. నిద్రలేమి సమస్య వల్ల వృద్ధాప్య ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది. కాబట్టి సరైన నిద్ర(Sleep) మన ఆయుష్షును పెంచుతుంది.
మంచి ఆహారపు అలవాట్లు(Food Habits) లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పోషకాహార లేమి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health Problems) వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్(Junk Food) తినడం వల్ల బరువు పెరుగుతారు. జీవక్రియ రేటు తగ్గిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. మధుమేహం, బీపీ(Bp) వంటి సమస్యలు వేధిస్తాయి. జట్టు(Hair) రాలే సమస్య వస్తుంది. చర్మం ముడతలు పడుతుంది.
ఎక్కువ ఒత్తిడితో ఉండటం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు(Problems) వస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన ఉండటం వల్ల జీవక్రియ అనేది మందగిస్తుంది. బరువు పెరుగుతారు. నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా బాధపెడుతాయి. ఎక్కువ ఒత్తిడి వృద్ధాప్య ఛాయలను వేగంగా పెరిగేలా చేస్తుంది. మద్యపానం, ధూమపానం వంటివి ఆరోగ్యానికి హానికరం. అవి శరీర భాగాల పనితీరును దెబ్బతీస్తాయి. ముఖం(Face) మెరుపును కోల్పోవడమే కాకుండా ముఖంపై ముడతలు ఏర్పడుతాయి. టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది. అయితే ఎనర్జిటిక్ గా ఉండటం కోసం తక్కువ మోతాదులోనే వీటిని తీసుకోండి. టీ, కాఫీలు అధికంగా తీసుకుంటే కెఫిన్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.