»A Drinking Water Bottle Has More Bacteria Than A Toilet Seat
Drinking Water Bottle : టాయ్ లెట్ కన్నా ఎక్కువ బ్యాక్టీరియా వాటర్ బాటిల్స్ లోనే…!
ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో చూసినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కనిపించడం సర్వసాధారణమైపోయింది. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా మంచినీళ్లు అంటే.. ప్లాస్టిక్ బాటిల్స్ లోనే తాగుతున్నారు.. అయితే మీకు ఒక విషయం తెలుసా, ఈ డ్రింకింగ్ వాటర్ బాటిల్లో టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఓ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది
ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో చూసినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కనిపించడం సర్వసాధారణమైపోయింది. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా మంచినీళ్లు అంటే.. ప్లాస్టిక్ బాటిల్స్ లోనే తాగుతున్నారు.. అయితే మీకు ఒక విషయం తెలుసా, ఈ డ్రింకింగ్ వాటర్ బాటిల్లో టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఓ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వాటర్ఫిల్టర్గురు.కామ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మనం వాడే వాటర్ బాటిళ్లలో టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉండవచ్చునని నివేదిక వెల్లడించింది. రీ యూసబుల్ వాటర్ బాటిల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది నివేదిక పేర్కొంది. చాలా బ్యాక్టీరియా నిండిన ప్రాంతం బాటిల్ లోపలి భాగం కాదు. బాటిల్ మూత భాగమే కావడం గమనార్హం.
US వెబ్సైట్ waterfilterguru.comలో ఇటీవలి అధ్యయనం ప్రకారం, సాధారణ టాయిలెట్ సీట్ల కంటే పునర్వినియోగ బాటిళ్లలో 40,000 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. అనేక విధాలుగా పరిశోధించిన తరువాత, వాటర్ బాటిల్స్ లో బ్యాక్టీరియా కనుగొన్నారు. అది మనపై కూడా ప్రభావం చూపిస్తాయట.
టాయిలెట్ సీటు కంటే పునర్వినియోగ వాటర్ బాటిల్లో 40,000 ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా… మనకు జీర్ణాశయ సమస్యలను కలిగిస్తుందట. ఇతర గృహోపకరణాలతో పోలిస్తే, వాటర్ బాటిల్స్… కంప్యూటర్ మౌస్ కంటే రెండింతలు, కిచెన్ సింక్ కంటే నాలుగు రెట్లు ,పెంపుడు జంతువుల నీటి డిష్ కంటే పద్నాలుగు రెట్లు ఎక్కువ సూక్ష్మక్రిములను కలిగి ఉంటాయని అధ్యయనాలు కనుగొన్నాయి. కాబట్టి వాటర్ బాటిల్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.