»Diagnostic Symptoms That Confirms Your Immunity Power Is Damaged
Immunity Damage: ఆ సమస్యలు వేధిస్తున్నాయా? ఇమ్యూనిటీ లోపం ఉన్నట్లే
రోజురోజుకూ వాతావరణంలో మార్పు జరుగుతోంది. ఈ వాతావరణ మార్పు వల్ల, గాలిలో ఉండే వైరస్(Virus)ల కారణంగా ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోగనిరోధక వ్యవస్థ(Immunity) శరీరంలోని ఆయా వ్యాధులు, ఆరోగ్య సమస్యల(Health Problems)పై పోరాటం చేస్తోంది. అయితే ఈ వ్యాధి నిరోధక శక్తి(Immunity)ని పటిష్టంగా ఉంచుకునేందుకు శరీరానికి కొన్ని రకాల పోషకాలు అనేవి అవసరం. ఆ పోషకాలు లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్(Immunity System) బలహీనంగా మారుతుంది.

ఇమ్యూనిటీ(Immunity) బలహీనంగా ఉంటే శరీరం అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యల(Health Problems) బారిన పడుతుంది. దీనినే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారు. మన శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల, లక్షణాల వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడిందని ముందుగానే గుర్తించొచ్చు. రోగనిరోధక శక్తి(Immunity) బలహీన పడితే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. రోగనిరోధక శక్తి బలహీనపడితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇమ్యూనిటీ సిస్టమ్(Immunity System) బలహీనపడితే కళ్లు పొడిగా మారుతాయి. కళ్లలో ఇసుక పడినట్లుగా అస్పష్టమైన దృష్టి ఏర్పడుతుంది. కళ్లలో తేమ శాతం తగ్గిపోతుంది. ఇలా కనుక ఉంటే మీలో రోగనిరోధక శక్తి తగ్గిందని అర్థం చేసుకోవాలి. అలాగే డిప్రెషన్ కూడా రోగనిరోధక వ్యాధి లక్షణంగానే అర్థం చేసుకోవచ్చు. ఆ స్థితిలో రోగ నిరోధక వ్యవస్థ(Immunity) మెదడుకు తాపజనక కణాలను పంపడం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అందుకే డిప్రెషన్ గా అస్సలు ఉండకండి.
చర్మంపై దద్దుర్లు, తామర ఏర్పడితే రోగనిరోధక(Immunity) వ్యాధి లక్షణం అయ్యుండచ్చొ. ఆ పరిస్థితిలో సొరియాసిస్ కూడా సోకే అవకాశం ఉంది. అందుకే అప్రమత్తమై వైద్యుడిని సంప్రదించాలి. గ్యాస్, అపానవాయువు, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి జీర్ణ క్రియ సమస్యలు వస్తే అది ఉదరకుహర వ్యాధి లక్షణం అని అర్థం చేసుకోవాలి. శరీరంలో ఇమ్యూనిటీ(Immunity) తగ్గినప్పుడే ఈ సమస్య వస్తుంది.