WHO-Heart Attacks : అధిక ఉప్పు వల్లే గుండెపోట్లు..డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
ఈమధ్య కాలంలో చాలా మంది గుండెపోటు(Heart Attacks)కు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. తాజాగా చోటుచేసుకుంటున్న గుండెపోటు హఠాన్మరణ ఘటనలపై డబ్ల్యూహెచ్ఓ(WHO) ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలు గుండెపోటు(Heart Attacks) రావడానికి గల కారణాన్ని వివరించింది. ఉప్పు(Salt)ను అధికంగా వాడటం వల్లే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడించింది.

సోడియం (ఉప్పు) మోతాదు పెరిగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని, అందుకే మితిమీరేటట్లుగా ఉప్పు వాడకూడదని సూచించింది. ఉప్పు(Salt) అధికంగా వాడటం వల్ల గుండెపోటు(Heart Attacks) మాత్రమే కాకుండా మరిన్ని సమస్యలు కూడా వస్తాయని తెలిపింది. ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయని డబ్ల్యూహెచ్ఓ(WHO) నివేదిక వెల్లడించింది.
2025 నాటికి ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు ఎవ్వరూ తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్ఓ(WHO) విచారం వ్యక్తం చేసింది. ఉప్పు(Salt) వాడకాన్ని తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలి. కానీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రపంచంలో సగటున 10.8 గ్రాముల ఉప్పును వాడుతున్నట్లు తేలింది.