ప్రస్తుతం మీడియం రేంజ్ సినిమాలు బడా హీరోల ప్రమోషన్స్‌తో.. మరింత పబ్లిసిటీ తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే చిరు, పవన్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్, బన్నీ.. లాంటి స్టార్ హీరోలు.. చిన్న సినిమాల కోసం తమవంతుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కోసం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్.
ఈ ఏడాది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో విజయాన్ని అందుకున్న విశ్వక్.. ఇప్పుడు ‘ఓరి దేవుడా’ అనే సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ హిట్ మూవీ ‘ఓమై కడువలే’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. ఒరిజనల్ వెర్షన్‌ను తెరకెక్కించిన ‘అశ్వత్ మరిముత్తు’నే దర్శకత్వం వహించాడు. ఇందులో సీనియర్ హీరో వెంకటేష్ దేవుడిగా కనిపించనున్నాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ క్రమంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్.. ఈ ఆదివారం రాజమండ్రిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు రామ్‌చరణ్ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్సీ 15 షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. దాంతో ఓరి దేవుడా ఈవెంట్‌కు చరణ్ అతిథిగా రానున్నారని టాక్. ఇదే నిజమైతే ఓరి దేవుడా సినిమా పై మంచి హైప్ క్రియేట్ అవడం పక్కా అని చెప్పొచ్చు.