»Pawan Kalyan Bro Movie Bro The Avatar Ticket Rate To Be Hiked By Ap Government
BRO: ‘బ్రో ది అవతార్’ టిక్కెట్ రేటు భారీగా పెంచనున్న ఏపీ సర్కార్?
అందరి హీరోల సినిమాలకు టిక్కెట్ రేటు పెంచి... పవన్ సినిమాలకు మాత్రం ఏపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుండి తీవ్రమైన ఒత్తిడి కారణంగా నిర్మాతలు ఆశించిన మేరకు టికెట్ రేట్స్ దొరకక, గతంలో పవన్ చేసిన రెండు సినిమాలకు కలెక్షన్లు రాలేదు.
BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో వేరేగా ఉంది. అన్ని ప్రాంతాల్లో కలెక్షన్ల వర్షం కురుస్తుంటే ఏపీలో మాత్రం వసూళ్లు నేల చూపు చూస్తున్నాయి. అందరి హీరోల సినిమాలకు టిక్కెట్ రేటు పెంచి… పవన్ సినిమాలకు మాత్రం ఏపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుండి తీవ్రమైన ఒత్తిడి కారణంగా నిర్మాతలు ఆశించిన మేరకు టికెట్ రేట్స్ దొరకక, గతంలో పవన్ చేసిన రెండు సినిమాలకు కలెక్షన్లు రాలేదు. దీంతో ఆ సినిమాలు భారీ స్థాయి నష్టాలను చవిచూశాయి. ఎన్ని నష్టాలు వచ్చినా పవన్.. ఫ్యాన్స్ ను నిరాశ పరచ్చలేదు.. వరుసగా సినిమాలు చేసుకుంటూనే వస్తున్నాడు. మిగిలిన హీరోల సినిమాలు రూ.200ల టికెట్ రేట్స్ తో నడిస్తే, పవన్ సినిమాలు మాత్రం రూ.వందల టికెట్ రేట్స్ తో నడిచేవి.
అభిమానులు ఇక మన సినిమాలకు ఇంతే వసూళ్లు వస్తాయి, ప్రభుత్వం మారేవరకు ఏపీ మార్కెట్ ని మర్చిపోవాల్సిందే అని అందరూ అనుకున్నారు. కానీ ‘బ్రో ది అవతార్’ చిత్రానికి ప్రొడ్యూసర్స్ టికెట్ రేట్స్ పెంచాలని కోరుతూ దరఖాస్తు పెట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే సంబందించిన పత్రాలను కూడా సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ మీద అదనంగా రూ.25 రూపాయిలు కోరబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ రేట్స్ కి థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం.ఇది రికవర్ అవ్వాలంటే కచ్చితంగా టికెట్ రేట్స్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు ఫ్యాన్స్. మరి జగన్ సర్కార్ అనుమతిని ఇస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.