Off day schools : ఏపీలో ఎల్లుండి నుంచి ఒంటి పూట బడులు..
ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు (Off day schools) ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Education Minister Botsa) తెలిపారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరుకు తరగతులు జరుగుతాయని ఆయన తెలిపారు. ఎల్లుండి నుంచి పదో తరగతి (10th class) పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి..
ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు (Off day schools) ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Education Minister Botsa) తెలిపారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరుకు తరగతులు జరుగుతాయని ఆయన తెలిపారు. ఎల్లుండి నుంచి పదో తరగతి (10th class) పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. పదవ తరగతి ఫలితాల నుంచే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. ఎండలు మండిపోతుండటంతో ఏపీ సర్కారు(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి హాఫ్ డే స్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స తెలిపారు. ఒంటి పూట బడులు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసని, ఎండల తీవ్రత లేదన్న కారణంతోనే ఇప్పటివరకు పూర్తి క్లాసులు నిర్వహించినట్లు చెప్పారు.
వాతావరణ శాఖ (Department of Meteorology) నివేదికలు ప్రతి వారం తెప్పించుకుంటున్నామని వివరించారు. వాతావరణ శాఖ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. మరోవైపు టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం అవుతాయని బొత్స తెలిపారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో(RTC bus) ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 6.69 లక్షల మంది విద్యార్థులు(students )పరీక్షలకు హాజరుకానున్నారని ఆయన వివరించారు.