• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రతి విద్యార్థి బ్రాండ్ అంబాసిడర్ కావాలి’

MDK: ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలని జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ‘Arrive-Alive’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత చేపట్టినట్టు వివరించారు.

February 26, 2026 / 06:58 PM IST

అభివృద్ధి పనులపై ఎంపీడీవో సమీక్ష

AKP: కోటవురట్ల మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో చంద్రశేఖర్ గురువారం మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలో ఉన్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. అలాగే నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, పీఆర్ ఏఈ వర్మ పాల్గొన్నారు.

February 26, 2026 / 06:57 PM IST

జిల్లాలో 20 కేంద్రాల్లో ‘నీట్’ పరీక్ష నిర్వహణ: కలెక్టర్

GNTR: మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్ష కోసం జిల్లాలో 20 కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో ఈ కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, పరీక్ష నిర్వహణపై సమీక్షించారు.

February 26, 2026 / 06:55 PM IST

కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం: మాజీ ఎమ్మెల్యే

GNTR: పొన్నూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గురువారం అనుబంధ విభాగాల కమిటీ టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ సమీక్ష సమావేశం జరిగింది. సుధాకర్ బాబు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి, రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సభ్యులకు సముచిత స్థానం కల్పిస్తారని తెలిపారు.

February 26, 2026 / 06:53 PM IST

​కోర్టు వాయిదాలకు డుమ్మా.. జైలుకు నిందితుడు

SRPT: రెండు కేసుల్లో కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న చివ్వెంల మండలం ఆయిలపురం గ్రామ నివాసి చేర్కుపల్లి సైదులును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సూర్యాపేట కోర్టు ఇతనిపై NBW జారీ చేయడంతో నిందితుడిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

February 26, 2026 / 06:52 PM IST

మంత్రి లోకేష్ పర్యటనకు ఏర్పాట్లు

AKP: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 28న రాంబిల్లి మండలం సీతపాలెంలో పర్యటిస్తున్న నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను సీఐ నర్సింగరావు ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతం, భద్రత ట్రాఫిక్ తదితర విషయాలపై చర్చించారు. బ్లూ జెట్ కంపెనీ ప్రారంభోత్సవానికి లోకేష్ ముఖ్యఅతిథిగా వస్తున్న విషయం తెలిసిందే.తగిన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

February 26, 2026 / 06:51 PM IST

జ్యోతిబా ఫూలే గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పల్నాడు జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాల్లో 5 నుంచి 8వ తరగతి , ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్ పరమేశ్వరరావు గురువారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 4 నుంచి మార్చి 3 వరకు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

February 26, 2026 / 06:51 PM IST

బాటసింగారం మార్కెట్‌లో తోతాపురి మామిడి రాక

RR: బాటసింగారం మార్కెట్‌లో తోతాపురి రకానికి చెందిన మామిడికాయలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. రుచితో పాటు, ఎగుమతులకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రకానికి భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, 2025 సంవత్సరంలో మామిడి విక్రయాల ద్వారా మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. దీంతో రైతులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 06:50 PM IST

ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన సీఎం సోదరుడు

NGKL: వెల్దండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి, MLA కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై గురువారం ఇంటిని ప్రారంభించారు. MLA మాట్లాడుతూ..అర్హులైన పేదవాడికి గృహ నిర్మాణ పథకం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.

February 26, 2026 / 06:50 PM IST

45 రోజుల్లో వెస్ట్ బైపాస్ పూర్తవుతుంది: కేశినేని చిన్ని

AP: విజయవాడ కలెక్టరేట్‌లో NH-65పై MP కేశినేని చిన్ని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’45 రోజుల్లో వెస్ట్ బైపాస్ పూర్తవుతుంది. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం. మెట్రో ప్రాజెక్టు ఆలస్యంతో ఫ్లైఓవర్ పనులు ఆగాయి. మెడికల్ కాలేజీ- నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్‌కు అనుమతి వచ్చింది. రైతులకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేస్తాం’ అని తెలిపారు.

February 26, 2026 / 06:50 PM IST

విజిలెన్స్ అధికారులు.. కల్తీ నెయ్యి గుట్టురట్టు

NDL: ​ఆత్మకూరులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. గురువారం ఆత్మకూరు పట్టణ కేంద్రంగా సాగుతున్న నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని గుర్తించి, భారీగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన భయంకరమైన నిజాలు స్థానికులను విస్తుపోయేలా చేశాయి.

February 26, 2026 / 06:50 PM IST

‘జిల్లాలో 195 అబాండెడ్ వాహనాలు.. 6 నెలల్లో క్లెయిమ్ చేయాలి’

కామారెడ్డి జిల్లాలో 195 అబాండెడ్ వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ప్రకటించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 26 ప్రకారం ఈ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన యజమానులకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకోవడానికి ఆరు నెలల గడువు ఉంటుందని, ఈలోపు క్లెయిమ్ చేసుకోకపోతే బహిరంగ వేలం వేస్తామని ఆయన పేర్కొన్నారు.

February 26, 2026 / 06:50 PM IST

సీతారాముల దేవస్థానానికి ఛైర్మన్‌గా మారం మీనారెడ్డి

నల్గొండ: కేతపల్లి మండలం బండపాలెం గ్రామంలోని శ్రీ సీతారాముల స్వామి దేవస్థానానికి నూతన ఛైర్మన్‌గా మారం మీనారెడ్డిని ఎమ్మెల్యే వేముల వీరేశంను ఏకగ్రీవంగా నియమించారు. మార్చిలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తానని మీనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.శ్రీనివాస్, సర్పంచ్ పెండ్యాల శ్రీనివాసరావు, వి.రాము, కోటిరెడ్డి, సురేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 06:48 PM IST

‘సంజీవిని సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

CTR: సంజీవని ప్రాజెక్ట్ సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో నాల్గవ సమావేశం నిర్వహించి, డిజిటల్ నర్స్ సెంటర్ మరియు “సంజీవిని” ప్రాజెక్ట్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంజీవినిసేవలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

February 26, 2026 / 06:46 PM IST

అబ్దుల్లాపురంలో వివాహిత ఆత్మహత్య

NDL: కొలిమిగుండ్ల(మం) అబ్దుల్లాపురంలో ఇవాళ జూటూరు పుష్పావతి అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి గురమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.

February 26, 2026 / 06:45 PM IST