TG: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో మృతి చెందిన పసిపాప మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని BRS నేత పుట్ట మధుకర్ అన్నారు. ఆ పసిపాప ప్రపంచాన్ని చూడకముందే.. కులవివక్షకు గురైందన్నారు. ఈ ఘటన మనం ఏ దశాబ్దంలో ఉన్నామో అర్ధం కావడం లేదని మండిపడ్డారు. ఇంకా అనాగరికతలోనే ఉన్నామా? అనే ఆలోచన కలుగుతుందని వాపోయారు.
GDWL: కేటిదొడ్డి మండలం గంగన్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు గ్రామస్థుడు జనార్దన్ రెడ్డి 200 స్టీల్ భోజన ప్లేట్లు విరాళంగా అందించారు. సర్పంచ్, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ప్లేట్లు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పిల్లల సంక్షేమానికి, గ్రామ అభివృద్ధికి ప్రోత్సాహం కల్పిస్తుందని గ్రామస్తులు అభినందించారు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వెస్టిండీస్ 8.2 ఓవర్లలో కేవలం 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రబడ 2, లుంగి ఎన్గిడి 3 పడగొట్టారు. ప్రస్తుతం హోలర్డ్(9), ఫోర్డ్(1) క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్ల ప్రదర్శనతో భారత అభిమానుల్లో సెమీస్ ఆశలు చిగురిస్తున్నాయి.
PLD: నాదెండ్ల పోలీస్ స్టేషన్‌ను నరసరావుపేట ట్రైనీ డీఎస్పీ కె. జయకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించి, స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. అలాగే రిజిస్టరును పరిశీలించి, కేసుల విచారణ వేగవంతం చేయాలని సూచించారు.
జమ్మూకశ్మీర్ కెప్టెన్ పారస్ డోగ్రాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. రంజీ ఫైనల్లో నిన్న కర్ణాటక ఫీల్డర్ అనీశ్‌ను పారస్ హెల్మెట్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనపై తాజాగా మ్యాచ్ రిఫరీ నారయణ్ స్పందిస్తూ.. JK సారథి డోగ్రాకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు తెలిపాడు. కాగా, ఈ మ్యచ్‌లో JK తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
SKLM: పార్లమెంట్ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎస్. నాగేశ్వరన్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు మంగళగిరిలోని మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.
MBNR: ఆన్లైన్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష కార్యక్రమానికి ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్‌లో విలేజ్ హిస్టరీ షీట్స్ అప్డేట్ చేయాలన్నారు. చట్టాల ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలకు 15,515 మందికి 15,209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. 98.03% హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు. రెండో రోజు ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు చెప్పారు.
PLD: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి అన్నారు. మాచవరం మండలం మోర్జంపాడు RSKలో రైతులకు ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయనాల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం అవలంబిస్తే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్నారు. ఇందులో భాగంగా సిబ్బంది అప్పలరాజు, మేరీ, సౌజన్య, పవన్ కుమార్, రైతులు పాల్గొన్నారు.
WNP: వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, గద్వాల, రాయచూర్, మంత్రాలయం వరకు నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఆయన ఆత్మకూరులో మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం కోసం మంజూరు చేయించామన్నారు. రూ.400 కోట్లతో ఆత్మకూరులో శాంతిని సుందరీకరణ చేస్తామని తెలిపారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. కాగా, నూతన దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
MBNR: కార్పొరేషన్ పరిధిలోని పాత పాలమూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాతూరు కుమార్ మాతృమూర్తి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గురువారం వారి నివాసానికి చేరుకుని వారిని పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
TG: నల్గొండలోని మెడికల్ కళాశాలను ఉత్తమంగా తీర్చిదిద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించామన్నారు. ప్రస్తుతం కాలేజీలో 350 మంది విద్యార్థులు ఉన్నారని.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని అన్నారు. అలాగే నల్గొండ మున్సిపాలిటీని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు.
NGKL: మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం హిందూ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ మతపెద్దల ఆశీర్వాదంతో మున్సిపల్ ఛైర్మన్‌గా తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్‌గా బాదం రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం సమన్వయంతో పనిసేసి, పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ మూవీలోని ‘ఆయా షేర్’ సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్ ఏకంగా 9 దేశాల్లో యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. భారత్, UAEలలో అగ్రస్థానంలో ఉండగా.. US, UK, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ట్రెండ్ అవుతోంది. పాటలోని ‘రా ఇంపాక్ట్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ గ్లోబల్ సెన్సేషన్‌గా మారి...