• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శాసనమండలి మరోసారి వాయిదా

AP: శాసనమండలిలో ఉత్కంఠ కొనసాగుతోంది. వివిధ ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చ కోరుతూ వైసీపీ సభ్యలు సభలో ఆందోళనకు దిగారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలకకుండా స్పీకర్ మండలిని మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

February 26, 2026 / 11:00 AM IST

రూ.2 కోట్ల గంజాయి స్వాధీనం

TG: భద్రాద్రి కొత్తగూడెంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రూ.2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. గంజాయి వారికి ఏ విధంగా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 10:59 AM IST

దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందించిన సర్పంచ్

MDK: రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన చింతల రాములు అనే దివ్యాంగుడు గత కొంతకాలంగా ట్రై సైకిల్ లేక ఇబ్బంది పడుతుండడంతో స్థానిక సర్పంచ్ తార్యా నాయక్ తన సొంత నిధులతో ట్రై సైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

February 26, 2026 / 10:57 AM IST

అసెంబ్లీలో కీలక బిల్లులు

AP: శాసనసభలో ప్రభుత్వం ఇవాళ రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. అసైన్డ్ భూముల చట్టసవరణ బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టగా.. గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పునకు సంబంధించిన బిల్లును మంత్రి డోలా వీరాంజనేయస్వామి సభ ముందు ఉంచారు. ఇకపై వీటిని స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు సచివాలయాలుగా పిలవనున్నారు.

February 26, 2026 / 10:55 AM IST

‘రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి’

ASF: కౌటాల మండలంలోని రైతులు తమ వ్యవసాయ భూములకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని AO ప్రేమలత గురువారం సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే రాయితీలు, యాంత్రీకరణ పనిముట్లు నేరుగా పొందే అవకాశం ఉంటుందన్నారు. గడువు సమీపిస్తున్నందున రైతులు వెంటనే AEOలను లేదా మీసేవ కేంద్రాలలో సంప్రదించాలన్నారు.

February 26, 2026 / 10:54 AM IST

గంటకోసారి లేవండి.. గుండెను కాపాడుకోండి

నేటి యాంత్రిక జీవనంలో గంటల తరబడి కూర్చొని పని చేయడం ప్రాణాంతకమవుతోంది. ఎక్కువ సేపు కూర్చోవడంతో కదలిక లేకపోవడం వల్ల రక్తప్రసరణ మందగించి గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అందుకే ఎంత పని ఉన్నా గంటకోసారి సీటు నుంచి లేచి, కనీసం 2 నిమిషాలు నడవాలి. ఈ చిన్న అలవాటు రక్తప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు శారీరక శ్రమను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

February 26, 2026 / 10:54 AM IST

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన కుటుంబసభ్యులతో గురువారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి దర్శనం చేశారు. అధికారులు, అర్చకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆయన జిల్లా ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ.. వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు పొందారు.

February 26, 2026 / 10:50 AM IST

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సీరియస్

HYD: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గత కొద్దిరోజుల నుంచి ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో రెగ్యులర్‌గా పర్యటిస్తున్న కమిషనర్ విధుల పట్ల అలసత్వం వహించిన వారిపై సీరియస్ అవుతున్నారు. చెత్త ఎత్తని వారిపై సీరియస్ అయ్యారు. ఉద్యోగం చెయ్యాలని ఉందా? చెత్త ఎత్తడం కాదు కింద పడొద్దని హెచ్చరించారు.

February 26, 2026 / 10:48 AM IST

లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్గా అబ్దుల్ హమీద్

SDPT: అడిషనల్ కలెక్టర్‌గా (లోకల్ బాడీస్) అబ్దుల్ హమీద్ నియామకమయ్యారు. సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా పని చేస్తున్న ఆయన ఇటీవల ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వం ట్రాన్సఫర్ చేస్తూ సిద్దిపేటలోనే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

February 26, 2026 / 10:46 AM IST

పంట పొలాల్లో ఉబికి వస్తున్న చమురు

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా ఖేడాలో వింత ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. పొలాల్లో నుంచి అకస్మాత్తుగా చమురు ఉబికి వస్తుండటంతో పాటు, దానికి మంటలు అంటుకోవడంతో కలకలం రేగింది. సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థ చేస్తున్న చమురు అన్వేషణ వల్లే ఈ లీకేజీ జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

February 26, 2026 / 10:46 AM IST

కత్తులు, కర్రలతో దాడులు.. ఎనిమిది మందికి గాయాలు

NTR: (D)లోని రెడ్డిగూడెం(M), కొత్త నాగులూరులో అర్ధరాత్రి ఆస్తి వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అన్నదమ్ముల మధ్య చెలరేగిన గొడవలో కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన మొత్తం ఎనిమిది మందికి గాయాలు కాగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 10:45 AM IST

చెరువుల్లో లొట్టాపీచు పెరుగుదలపై స్థానికుల ఆందోళన

VKB: బషీరాబాద్ మండలం దామర్చేడ్ గ్రామంలోని చెరువులు విపరీతంగా లొట్టాపీచు (బేషారం) మొక్కలతో నిండిపోయాయి. దీనివల్ల నీరు కలుషితంమై మత్స్యకారులకు, పంటలకు నష్టం కలుగుతుందని గ్రమస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చెరువుల పొదలను తొలగించి, నీటిని శుభ్రం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 26, 2026 / 10:45 AM IST

వెన్నచెడ్ జామా మసీదులో రంజాన్ ఉత్సవం

MBNR: గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలోని జామా మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాస-దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొని మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ దోమ పులిందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్ల రెడ్డి రమేష్ చారి, రాములు గౌడ్, బాలయ్య షేక్ అలీ, ఇజాజ్ పాషా తదితరులు ముస్లిం సోదరులతో ఆనందంగా పంచుకున్నారు.

February 26, 2026 / 10:45 AM IST

గోరికొత్తపల్లి ఆరే కుల సంఘం మండల కమిటీ ఎన్నిక

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో జిల్లా ఆరే కుల సంఘం అధ్యక్షుడు వంచనగిరి వీరేశం, రాష్ట్ర నాయకులు మటికే సంతోష్, మండల అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో ఆరే కుల సంఘం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడిగా ఓన్నాల శివాజీ, ఉపాధ్యక్షులుగా రాజేందర్, శ్యాం రావు, గౌ.అధ్యక్షుడిగా తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా గణేష్ను ఎన్నుకున్నారు.

February 26, 2026 / 10:43 AM IST

కల్తీ పాల ఘటన బాధితులను పరామర్శించిన మంత్రి

E.G: రాజమండ్రి కిమ్స్ ఆస్పత్రిలో కల్తీ పాల ఘటన బాధితులను మంత్రి కందుల దుర్గేష్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కల్తీ ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

February 26, 2026 / 10:43 AM IST