• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పులివెందుల సీఐ ఇంట్లో భారీ నగదు

KDP: ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 11:20 AM IST

‘పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలి’

GNTR: ఆత్మహత్యలకు కారణమవుతున్న ‘పారాక్వాట్’ గడ్డిమందును నిషేధించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. ఇది సైలెంట్ కిల్లర్‌గా మారిందని, 5 ఎంఎల్ తాగినా ప్రాణాలు పోతున్నాయన్నారు. దీనికి ఎలాంటి విరుగుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, పంజాబ్ తరహాలో ఏపీలోనూ ఈ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని కోరారు.

February 26, 2026 / 11:19 AM IST

BREAKING: భూకంపం.. భయాందోళనలో ప్రజలు

TG: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.9గా తీవ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలకు 35 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

February 26, 2026 / 11:19 AM IST

చందోలు యానాది కాలనీలో కార్డెన్ సెర్చ్

BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు ఎస్.టి. యానాది కాలనీలో కార్డెన్  సెర్చ్ నిర్వహించారు. బుధవారం ఉదయం ఇంటింటికీ తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతల కోసం తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

February 26, 2026 / 11:16 AM IST

స్టువర్టుపురంలో నాటు సారా పట్టివేత

BPT: వేదుళ్లపల్లి పరిధిలోని స్టువర్టుపురంలో ఎస్సై భాగ్యరాజు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. మన్యం లక్ష్మి అనే వ్యక్తి నుంచి 4 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. నాటు సారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని ఎస్ఐ సూచించారు.

February 26, 2026 / 11:16 AM IST

చిరంజీవితో ఇలాంటి సినిమా సాహసమే: పరుచూరి

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కేవలం కామెడీతో చిరంజీవితో సినిమా తీయడం సాహసమని, తొలి సీన్‌లోనే పాత్రను పరిచయం చేసిన తీరు బాగుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రం రూ.400 కోట్లు వసూలు చేసి, కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే దీని విజయానికి నిదర్శనమని, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారని తెలిపారు.

February 26, 2026 / 11:15 AM IST

ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే చాలా స్పెషల్

KMM: ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న గ్రీన్​ ఫీల్డ్ హైవే(ఎన్​హెచ్​ 365 బీజీ) ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో పాటు మరెన్నో కొత్త అంశాలను ఈ హైవే పనుల్లో ఉపయోగిస్తున్నారు. ఎన్ హెచ్​ 65, ఎన్​హెచ్​ 16ను కలుపుతూ రూ.4451.87 కోట్లతో 162 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తున్నారు.

February 26, 2026 / 11:15 AM IST

వెంకన్న వార్షిక తిరు కళ్యాణోత్సవాలకు శ్రీకారం

AKP: టీటీడీకి చెందిన నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలకు గురువారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవాలకు ప్రారంభ సూచికగా ఉత్సవ కావిడితో తిరువీధి సేవ నిర్వహించారు. సాయంత్రం విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం కంకణ ధారణ, అంకురార్పణ, గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.

February 26, 2026 / 11:13 AM IST

ఒకే జిల్లాలో భార్యాభర్తలు విధులు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్‌లు ఇచ్చారు. HNK కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్‌ను నియమించగా, ఆమె భర్త వరుణ్ రెడ్డి ప్రస్తుతం NPDCL CMDగా హన్మకొండలోనే విధులు నిర్వహిస్తున్నారు. అలాగే స్నేహ శబరీశ్‌ను మహబూబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆమె భర్త శబరీష్ ప్రస్తుతం అదే జిల్లాకు SPగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

February 26, 2026 / 11:12 AM IST

ఓడిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ అభ్యర్థి

KNR: హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గుర్రం హరిబాబు ఓడిపోయినా తన హామీని నెరవేర్చుకున్నారు. వార్డులో ఏ ఆడబిడ్డ వివాహం జరిగినా రూ. 10,116 ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం యంజాల భాగ్య-వాసుల కుమార్తె శ్రావ్య వివాహానికి హాజరై నగదు అందజేశారు. ఆడపిల్ల పుడితే కూడా రూ. 10,116 మొత్తాన్ని అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

February 26, 2026 / 11:12 AM IST

సీతారాముల ఆలయ నిర్మాణానికి రూ.15 వేల విరాళం

KRNL: దేవనకొండ(M) కరివేముల గ్రామ శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి రూ.15,000 విరాళం అందించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాముని పరిపాలన ప్రపంచానికే ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్.కె. శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 11:10 AM IST

వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ విగ్రహ ప్రతిష్ట

BDK: పాల్వంచ మండలంలోని గడిపాడు గ్రామంలో శ్రీ దేవి గోదా దేవి సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గురువారం ఈ పవిత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.

February 26, 2026 / 11:10 AM IST

ఘనంగా ఎల్లమ్మ సిద్దోగం వేడుకలు

SRCL: కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ సిద్దోగం ఘనంగా నిర్వహించారు. ఐదేళ్లకోసారి జరిగే పండుగకు గీతకార్మికులు పెద్దఎత్తున హాజరయ్యారు. వేడుకలో భాగంగా ఒకే తాటిచెట్టు కల్లును కొంత మంది గీతకార్మికులు కలిసి కిందకు దింపారు. అమ్మవారికి సమర్పించే కల్లు కుండ.. మోకు, ముస్తాదుకు అంటకుండా చేతుల మీదుగా దించడం ఆనవాయితీగా వస్తోంది.

February 26, 2026 / 11:09 AM IST

పలు రైళ్లు పాక్షికంగా రద్దు

ATP: గుంతకల్లు మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాస్కోడిగామా వరకు వెళ్లే షాలీమార్, తిరుపతి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లను ఏప్రిల్ నుంచి జూన్ వరకు హుబ్లీ స్టేషన్ వరకే పరిమితం చేశామని అన్నారు. హుబ్లీ-వాస్కోడిగామా మధ్య ఈ రైళ్లు నడవవని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని కోరారు.

February 26, 2026 / 11:08 AM IST

ప్రాజెక్టులపై MLC ఇసాక్ కీలక వ్యాఖ్యలు

ఏపీ శాసన మండలిలో రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ MLC ఇసాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం నుంచి 800 అడుగులలోపు నీటిని తెలంగాణ తరలిస్తోందని, దీనిని అడ్డుకోవడానికి గత ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ తెచ్చి 80 శాతం పనులు పూర్తి చేసిందని గుర్తుచేశారు. అయితే, చంద్రబాబుతో మాట్లాడి ఈ ప్రాజెక్టు పనులను ఆపించామని TG సీఎం రేవంత్ స్వయంగా చెప్పారని ఆయన ఆరోపించారు.

February 26, 2026 / 11:08 AM IST