రాజస్థాన్లోని బార్మర్ జిల్లా ఖేడాలో వింత ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. పొలాల్లో నుంచి అకస్మాత్తుగా చమురు ఉబికి వస్తుండటంతో పాటు, దానికి మంటలు అంటుకోవడంతో కలకలం రేగింది. సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థ చేస్తున్న చమురు అన్వేషణ వల్లే ఈ లీకేజీ జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.