• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హోంశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి రామగిరి మండల పోలీస్ వసతులపై చర్చించారు. రామగిరిలోని ఎస్సై, సిబ్బంది క్వార్టర్లు అసంపూర్తిగా ఉన్నాయని, వాటికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని విన్నవించారు. పోలీస్ స్టేషన్ ఆధునీకరణ, కాంపౌండ్ వాల్, రోడ్డు సౌకర్యాల కోసం రూ. 3 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.

February 26, 2026 / 11:30 AM IST

పేదలకు సంతింటికలాన్ నెరవేరింది :తిరుమల్ రెడ్డి

SDPT: మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శివోల సతీష్ ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల గృహ ప్రవేశంలో ప్రారంభోత్సవంలో సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము ఎన్నో సంవత్సరాలు సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సొంత ఇంటి కల పేదలకు నెరవేరింది.

February 26, 2026 / 11:30 AM IST

మహానందీశ్వరుని సన్నిధిలో ప్రముఖుల పూజలు

NDL: మహానంది క్షేత్రంలో కర్నూలు జిల్లా కన్ఫ్యూమర్ కోర్టు జడ్జి జస్టిస్ కరణం కిషోర్ కుమార్ ఏపీ లోకాయుక్త సీసీ అమరేంద్ర రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వీరికి ఘనంగా స్వాగత పలికారు. శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందిశ్వరస్వామిని దర్శించుకుని అభిషేకాలు కుంకుమార్చనలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

February 26, 2026 / 11:30 AM IST

ఒకే ఒక్క పోస్టుకు నోటిఫికేషన్ విడుదల

కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని న్యాయవాదులకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. క్రిమినల్ లా ప్రాక్టీస్ లో కనీసం 7 ఏళ్ల అనుభవం, సెషన్స్ కేసులు నిర్వహించిన వారు అర్హులన్నారు.

February 26, 2026 / 11:30 AM IST

‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్..!

నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో రాబోతున్న ‘బ్లడీ రోమియో’పై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం కోసం ముగ్గురు సంగీత దర్శకులను తీసుకోవాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నాడట. యాక్షన్, రోమాన్స్, డ్రామా ఎమోషన్స్‌కు తగ్గట్టుగా ఒక్కో విభాగానికి ఒక్కో స్పెషలిస్ట్‌ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్‌లోనే ఇలా మల్టీపుల్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం విశేషం.

February 26, 2026 / 11:30 AM IST

నేటి నుంచి శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇవాళ గురువారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ధర్మకర్తలు చెన్నమనేని విష్ణువర్ధన్, వంశీవర్ధన్ ఆధ్వర్యంలో ఉత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు మరింగంటి రామకృష్ణాచార్యులు తెలిపారు. ఈరోజు నుంచి మార్చి 5వ తేదీ వరకు జరుగుతాయి.

February 26, 2026 / 11:29 AM IST

ఘనంగా రామావత్ భీమా నాయక్ వర్ధంతి వేడుకలు

NLG: అఖిల భారత బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షులు రామావత్ భీమా నాయక్ 9వ వర్ధంతి సందర్భంగా దేవరకొండలోని బంజారా భవనంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని భీమా నాయక్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంజారా సమాజం కోసం భీమా నాయక్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.

February 26, 2026 / 11:26 AM IST

అకాల వర్షం.. అన్నదాతలకు తీవ్ర నష్టం

MHBD: రైన్య తండా గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతుల మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. పంట పక్వానికి వచ్చే సమయంలో భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం కారణంగా మొక్కలు నేలకు ఒరిగిపోయాయి. చాలా చోట్ల నీరు నిలిచి పంట మునిగిపోయింది. రైతులు పంట నష్టం భరించలేక ఆందోళన చెందుతున్నారు

February 26, 2026 / 11:25 AM IST

సింహ వాహనంపై దర్శనం ఇచ్చిన శ్రీవారు

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారు సింహ ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి ఉత్సవ మూర్తిని యోగ నారాయణస్వామి రూపంలో అర్చకులు అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత సింహ వాహనంపై శ్రీవారిని కొలువుదిర్చి పురవీధుల్లో ఊరేగించారు.

February 26, 2026 / 11:24 AM IST

ఘనంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రారంభం

AKP: యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెదపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీవిశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. రేజేటి శ్రీరామాచార్యులు చేతుల మీదుగా వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. సంప్రోక్షణ, జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం నిర్వహించి దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు.

February 26, 2026 / 11:24 AM IST

‘మమ్మీ డాడీ నన్ను క్షమించండి’

AP: విశాఖలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధురవాడలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఫిజియోథెరఫీ సెకండ్ ఇయర్ చదువుతున్న రజిని అనే విద్యార్థిని ప్రేమించిన యువకుడు వదిలేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ‘మమ్మీ డాడీ నన్ను క్షమించండి.. అతన్ని మర్చిపోలేకపోతున్నా’ అంటూ లెటర్‌లో పేర్కొంది.

February 26, 2026 / 11:24 AM IST

నెల్లూరు మేయర్ ఎన్నికకు వైసీపీ దూరం

NLR: నెల్లూరు మేయర్ ఎన్నికకు YCP కార్పొరేటర్లు దూరమయ్యారు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలతోనే కౌన్సిల్ సమావేశానికి ఎవరు హాజరు కాలేదని సమాచారం. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరుకు గురువారం జగన్ వచ్చారు. కార్పోరేటర్లు అందరూ ఆయన వద్దకు వెళ్లారు. మరోవైపు టీడీపీ కార్పొరేటర్ అందరూ సమావేశానికి వచ్చారు.

February 26, 2026 / 11:24 AM IST

రేపు ఘనంగా “వీర జవాన్” విగ్రహావిష్కరణ

VKB: దాదాపూర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల తోకని శ్రీనివాస్, దేశ రక్షణలో అమరుడైనందున ఆయనకు అంకితంగా “వీర జవాన్” విగ్రహాన్ని రేపు ఉదయం 11:30 గంటలకు దోమ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రత్యేకంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దోమ సర్పంచ్ శివకుమార్ పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, గ్రామస్థులు ఘనంగా హాజరుకావాలని ఆహ్వానించారు.

February 26, 2026 / 11:23 AM IST

లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్‌గా కీమ్యా నాయక్

WNP: జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా సేవలందించిన ఆయనను, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా కేటాయించింది. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాలనను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పు చేపట్టింది. త్వరలోనే తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.

February 26, 2026 / 11:22 AM IST

ధరూర్ పాఠశాలలో ఉపాధ్యాయులకు సత్కారం

GDWL: ధరూర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ ధరూర్ పాఠశాలలో హెడ్మాస్టర్ ప్రతాప్ రెడ్డి ఫిజికల్ సైన్స్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో ఆయన ఉపాధ్యాయుల సమిష్టి కృషి విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఫిజికల్ సైన్స్ బోధనలో నాణ్యత పెంచేందుకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు ప్రశంసించారు.

February 26, 2026 / 11:22 AM IST