• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రూ.1.05 కోట్లు కాజేసిన ఆరుగురు అరెస్ట్‌

VSP: ప్రభుత్వ అధికారులమని నమ్మించి రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.1.05 కోట్లు కాజేసిన కేసులో ఆరుగురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధార్ కేసుల పేరుతో బాధితుడిని భయపెట్టి విడతల వారీగా డబ్బు వసూలు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు అందిస్తూ కమిషన్లు పొందుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశానన్నారు.

February 27, 2026 / 10:17 AM IST

డీజీపీ శివధర్ రెడ్డి ఖమ్మం పర్యటన రద్దు

KMM: డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

February 27, 2026 / 10:17 AM IST

వైభవంగా ఎల్లమ్మ తల్లి జాతర

VZM: నెల్లిమర్ల మండలంలోని సతివాడ గ్రామంలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర గురువారం రాత్రి ఘనంగా జరిగింది. సుమారు 20 గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారి అలయానికి తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అమ్మవారి చదును నుంచి సిరిమాను మూడు సార్లు తిరిగింది. ఆ సమయంలో అమ్మవారి దర్శనంకు భక్తులు పోటీపడ్డారు.

February 27, 2026 / 10:17 AM IST

‘నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి’

BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని అరుంధతి నగర్‌లో సుమారు రూ. 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న OHSR వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే నిర్మాణం నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

February 27, 2026 / 10:16 AM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆర్యవైశ్య సంఘం సభ్యుడు శ్రీనివాసులు కుమారుని వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 27, 2026 / 10:15 AM IST

సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్

CTR: సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.

February 27, 2026 / 10:15 AM IST

‘సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి’

CTR: సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.

February 27, 2026 / 10:15 AM IST

హత్య చేసింది విద్యార్థులే

అన్నమయ్య: గాలివీడులో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదాలు అన్నదమ్ముల మధ్య వర్గ పోరే ఈ హత్యకు కారణమని DSP కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. పొద్దుటూరుకు చెందిన కులాయప్ప, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాథరెడ్డి, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

February 27, 2026 / 10:14 AM IST

చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

GNTR: కొల్లిపర మండలం అత్తోట సమీపంలోని కుంచవరం అడ్డరోడ్డు వద్ద గల పంట పొలాల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. మృతదేహం కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడు ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు.

February 27, 2026 / 10:14 AM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీఐ

SKLM: ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న తీరును సీఐ ఎం శ్రీనివాసరావు పరిశీలించారు. శుక్రవారం జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని నిబంధనలను మితిమీరితే కేసులు పెట్టడం తప్పదని హెచ్చరించారు.

February 27, 2026 / 10:14 AM IST

అవిసె గింజ‌ల‌తో ఆరోగ్య ప్రయోజనాలు

అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. రక్తపోటును నియంత్రించడంలోనూ ఇవి కీలకం. వీటిని పొడి రూపంలో రోజూ తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ప్రకాశవంతంగా మారుతాయి.

February 27, 2026 / 10:13 AM IST

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 943 సేవలు: లోకేష్

AP: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 943 రకాల సేవలు అమలు చేసినట్లు మంత్రి లోకేష్ అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌కు AIని జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చామని తెలిపారు. వేగంగా స్పందించడం, రసీదు రావాలనే అంశాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సభ్యులు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, మనమిత్ర 2.0ను కూడా ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

February 27, 2026 / 10:13 AM IST

తహసీల్దార్‌కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి

RR: కొత్తూర్ మండల తాహసీల్దార్ రవీందర్ రెడ్డికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. వరంగల్ KUDA(కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆర్డర్ కాపీని అందజేశారు. నిబద్ధత కలిగిన వ్యక్తి తహసీల్దార్‌కు పదోన్నతిపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 10:12 AM IST

టీమిండియాకు GOOD NEWS

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా మార్చి 1న కోల్‌కతా వేదికగా భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన వాతావరణ శాఖ ఆరోజు వర్షం పడే అవకాశం లేదని, 23 డీగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని స్పష్టం చేసింది.

February 27, 2026 / 10:12 AM IST

నూతన ఎంఈవోగా చెన్నయ్య బాధ్యతలు స్వీకరణ

VKB: ధారూర్ మండల నూతన విద్యాధికారిగా (MEO) ఎం. చెన్నయ్య బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం సమగ్ర చర్యలు చేపడతానని, మండలాన్ని విద్యా రంగంలో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని సూచించారు.

February 27, 2026 / 10:11 AM IST