రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో కల్తీ పాల కలకలం రేగింది. పాల సేకరణ నిర్వాహకుడు శ్రీశైలం గౌడ్ కృత్రిమ పాలు తయారు చేసి డైరీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో, మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో భారీగా కృత్రిమ పాలను, వాటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా: నందివాడ మండలం పోలుకొండ గ్రామం చంద్రయ్య కాలువ కరకట్టపై దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేద బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన ఎస్టీ కుటుంబాలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా పైపులైన్ నిర్మాణం చేపడుతున్నారని వారు ఆరోపించారు.కాలువ కరకట్టపై సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయని వార్తలు తెలిపారు.
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం తేజ మిర్చి క్వింటాకు రూ.19,000 అత్యధిక ధర పలికింది. ఈ నెల 20న రూ.18,000 ఉన్న తేజ మిర్చి, ఈ నెల 24న 18,300, 25న 18,400, 26న రూ.18,700 ధర చొప్పున పెరుగుతూ ఈరోజు క్వింటాకు రూ.19,000 ధర పలికింది. వారం రోజుల్లో రూ.వేల ధర పెరగడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
TPT: హెరిటేజ్ కంపెనీ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యలేదని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. నెయ్యి సరఫరాలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను,హెరిటేజ్ పాత్ర లేదన్నారు. అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమవుతుందని అనుకోవడం వైసీపీ నాయకుల భ్రమ అని ఎద్దేవా చేశారు.
AP: మండలిలో తిరుమల లడ్డూ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో మండలి ఛైర్మన్ శాసనమండలిని వాయిదా వేశారు. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ర్యాలీగా నినాదాలు చేస్తూ మండలికి వచ్చారు. నిజాలు బయటపడతాయనే మండలిని వాయిదా వేస్తున్నారని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
BHPL: గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన ఉపాధి హామీ పనులు చిట్యాల మండలంలో వేగం అందుకున్నాయి. వ్యవసాయ పనులు ముగింపు దశకు చేరడంతో రైతులు, కూలీలు ఉపాధి హామీ పనుల వైపు మళ్లుతున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పనులకు పెద్ద సంఖ్యలో కూలీలు హాజరవుతున్నారు. కైలాపూర్ శివారు రాయిచెరువులో కూలీలు ఉత్సాహంగా పనులు నిర్వహిస్తున్నారు.
MBNR: ‘ప్రజా బాట’లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా విద్యుత్ ఎస్ఈ భీమా నాయక్ అన్నారెడ్డిపల్లిని సందర్శించారు. గ్రామంలో వేలాడుతున్న పాత వైర్లు, తుప్పు పట్టిన స్తంభాలను పరిశీలించారు. రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ మరమ్మతులు చేపట్టాలని.. విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘స్వయంభు’. విజువల్ గ్రాండియర్‌గా రూపొందుతున్న ఈ మూవీపై తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. కథా దృష్ట్యా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు నిఖిల్ స్వయంగా ప్రకటించాడు. 2026 ఏప్రిల్ 10న తొలి భాగాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ వార్తతో ఫ్యాన్స్‌లో అంచనాలు రెట్టింపయ్యాయి.
SRD: పటాన్‌చెరు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి చెందిన నాగఅక్షయ లక్ష్మి (బీఏ ఫైనల్ ఇయర్), రుద్రారం గీతం యూనివర్సిటీలో చదువుతోంది. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తాను బయటకు వెళ్తున్నానని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని యూకేలో ఉన్న సోదరుడికి వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
NLG: చందంపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కేంద్ర సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ పీఎం నోడల్ ఆఫీసర్ కమలేష్ కుమార్ మిశ్రా సందర్శించారు. పాఠశాలలోని వసతులు, విద్యా బోధన తీరును ఆయన స్వయంగా పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, డీఈవోబీ. భిక్షపతి, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
MDK: శివంపేట మండలంలోని కొత్తపేటలో ఉపాధి హామీ పనులు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో జరుగుతుండటంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని ప్రదేశంలో కనీసం తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్ సౌకర్యాలు లేవని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి, పని ప్రదేశంలో ప్రాథమిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
BDK: ఇల్లందులో పారిశుద్ధ్య విధుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల జ్ఞాపకార్థం ఫిబ్రవరి 28న సంజయ్ నగర్ సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద సంతాప సమావేశం నిర్వహించనున్నట్లు టీయూసీఐ నేతలు తెలిపారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు.
E.G: గోపాలపురం MLA మద్దిపాటి వెంకట్రాజు సహకారంతో గురువారం దేవరపల్లిలో బాధితులకు CM సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ. 4.29లక్షల విలువైన చెక్కులను గ్రామ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తంగెళ్ల మునేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నేతలు పేర్కొన్నారు.
AP: శాసనమండలిలో ఛైర్మన్ కీలక ప్రకటన చేశారు. నిన్న సభను అధికారపక్షం అడ్డుకుందని అన్నారు. లడ్డూపై చర్చ జరగకుండా అధికారపక్షం సభను తప్పుదోవపట్టించిందని తెలిపారు. ఛైర్మన్ వ్యాఖ్యలను మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తాము దేనికైనా చర్చకు సిద్దమన్నారు. లడ్డూపై చర్చ అంటేనే వైసీపీ సభ్యులు పారిపోతున్నారని ఆరోపించారు.
W.G: చింతలపూడిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఆన్ లైన్ పనులకు ప్రత్యేక సిబ్బందిని నియమించి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్ డీఎలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి మెమో 57 తక్షణమే అమలు చేయాలని కోరారు.