• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

టెన్త్ విద్యార్థుల నామినల్ రోల్స్ సవరణలకు రేపే లాస్ట్

E.G: మార్చి 2026లో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఉన్న వివరాల సవరణకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. రేపటి వరకు సవరణలకు అవకాశం ఉందన్నారు. విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

February 27, 2026 / 02:30 PM IST

ఇంటర్మీడియట్ పరీక్షలకు 455 మంది గైర్హాహాజరు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 5వ రోజు అయిన శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 455 మంది గైర్హాజరయ్యారు. హిస్టరీ, బాటని, ఒకేషనల్ కోర్సుల్లో 60 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. రెగ్యులర్ కోర్సులకు 1538 మంది హాజరు కావాల్సి ఉండగా 1372 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1500 మంది రాయాల్సి ఉండగా 1377 మంది విద్యార్థులు రాశారు.

February 27, 2026 / 02:30 PM IST

వైన్స్‌పై చర్యలు తీసుకోవాలని వినతి

MDCL: నేరేడ్మెట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న 9 వైన్స్ దుకాణాపై తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు, మల్కాజ్‌గిరి ఎస్‌హెచ్‌వోకు వినతి పత్రం అందజేశారు. ఈ దుకాణాల వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిలో పేర్కొన్నారు. వినతి ఇచ్చిన వారిలో వీ.ప్రసన్న నాయుడు, కే. గీతామూర్తి, జే.అంజలి దేవిలు ఉన్నారు.

February 27, 2026 / 02:30 PM IST

ప్రపంచ ఎన్జీవో దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

VZM: ప్రపంచ ఎన్జీవో దినోత్సవం సందర్భంగా అయ్యన్నపేట జంక్షన్లో ఉన్న మదర్ థెరిసా కిడ్స్ స్కూల్లో శుక్రవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా పలువురు యువత రక్తదానం చేశారు. ఈసందర్బంగా మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు- త్యాడ ప్రసాద్ పట్నాయక్ నిరంతర రక్తదాత అయిన పోలుబోతు దుర్గాప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.

February 27, 2026 / 02:30 PM IST

పరీక్షా కేంద్రానికి తనిఖీ చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్

NRML: ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా లోకేశ్వరం పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సిర్గా రవీందర్, బాబు సింగ్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. సూపరింటెండెంట్ విఠల్, డీవో నారాయణ పాల్గొన్నారు.

February 27, 2026 / 02:29 PM IST

నూతన కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

MDK: నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమా సింగ్‌ను శుక్రవారం జిల్లా ఎస్పీ డీ.వీ. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల్లో పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ యంత్రాంగాలు తదితర అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.

February 27, 2026 / 02:28 PM IST

జర్నలిస్టు కుటుంబానికి బీసీ నేత పరామర్శ

MBNR: జర్నలిస్టు నరసింహ కుటుంబానికి అండగా ఉంటామని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నేత సారంగి లక్ష్మీకాంత్ అన్నారు. గత ఆరు నెలల క్రితం అనారోగ్య కారణాలతో జర్నలిస్టు దాసరి నరసింహ మృతిచెందగా, నిన్న ఆయన సతీమణి లలిత కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నేత మృతురాలి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

February 27, 2026 / 02:27 PM IST

పీకల వాగులో ప్లాస్టిక్ వ్యర్థాలు.. స్థానికుల ఇబ్బందులు

GNTR: కంకరగుంట రైల్వే ఫ్లైఓవర్ కింద ఉన్న ‘పీకల వాగు’ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. దీనివల్ల మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తోంది. కాలువలో పెరిగిన దోమలు, ఈగల వల్ల స్థానికులు జ్వరాలు, వైరల్ వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కాలువను శుభ్రపరచాలని శుక్రవారం స్థానికులు కోరారు.

February 27, 2026 / 02:26 PM IST

సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం భట్టి

KMM: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుని వారి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

February 27, 2026 / 02:24 PM IST

కేయూ మొదటి గేటు ఎద్దుల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

HNK: కేయూ మొదటి గేటు ఎదుట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై కొట్లాడుతున్న జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భానును వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీజేపీ వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు అలువాల కార్తీక్, రాహుల్, వర్ధన్ ఉన్నారు.

February 27, 2026 / 02:24 PM IST

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: నంద్యాల జిల్లా జగదుర్తి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 02:22 PM IST

మహిళా సమైక్య సంఘం భవనానికి భూమి పూజ

NGKL: కల్వకుర్తి(మం) తోటపల్లిలో దాదాపు రూ. 10 లక్షల నిధులతో మంజూరైన మహిళా సమైక్య సంఘం భవనానికి గ్రామ సర్పంచ్ జోగు రమణమ్మ, గ్రామ కార్యదర్శి లింగం ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహిళ సంఘాల సమావేశాలకు భవనం ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

February 27, 2026 / 02:21 PM IST

జిల్లాలో ఎంత మంది విద్యార్థుల గైర్హాజరు అంటే..!

కర్నూలు: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప శుక్రవారం తెలిపారు. మొత్తం 5,069 మందికి గానూ 4,711 మంది పరీక్షలకు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని అధికారి వెల్లడించారు.

February 27, 2026 / 02:20 PM IST

నకిరేకల్‌లో ప్లకార్డులతో డీవైఎఫ్ఐ నిరసన

NLG: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకుల అహంకారంతో రెండు నెలల పసిపాప ప్రాణాలు తీయడం పట్ల డీవీఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరేకల్ బస్టాండ్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. బాధితులపై దాడి చేసిన 8 మందిని వెంటనే అరెస్ట్ చేయాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.

February 27, 2026 / 02:20 PM IST

MLAను సన్మానించిన MLC

మంచిర్యాల MLA కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుని శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, కాగజ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ షాహిన్ సుల్తాన్ దస్తగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా MLAను కౌన్సిలర్‌లతో కలిసి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే వారందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.

February 27, 2026 / 02:19 PM IST