కర్నూలు: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప శుక్రవారం తెలిపారు. మొత్తం 5,069 మందికి గానూ 4,711 మంది పరీక్షలకు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని అధికారి వెల్లడించారు.