గద్వాల జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్ ఆమినా మస్జిద్లో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా మసీదుకు వచ్చిన ఆయన వీఐపీ ప్రోటోకాల్ లేకుండా సాధారణ భక్తులతో కలిసి ఒకే వరుసలో నిలబడి నమాజ్ చేశారు. కలెక్టర్ నిరాడంబరతను స్థానికులు అభినందించారు. భక్తి ముందు అందరూ సమానమని ఆయన సందేశం ఇచ్చారు.
కృష్ణా: మచిలీపట్నంలో మరో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గన్నవరంలో క్రీడల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియాలో భాగంగా నగరంలోని గోసంఘం టిడ్‌కో గృహాల సమీపంలో రూ.17 కోట్లతో బహుళ ప్రయోజనాల ఇండోర్ స్టేడియం, రూ. 9.30 కోట్లతో స్విమ్మింగ్ పూల్‌కి స్థలం కేటాయించామన్నారు.
WNP: ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ వాడ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం సర్పంచ్ సూచనలతో టాయిలెట్స్ నిర్మాణ పనులకు ముగ్గు పోసి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఆరోగ్యం పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా పాఠశాల వాతావరణం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తాదుల స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం లెక్కింపు చేశారు. ఈవో విజయరాజు మాట్లాడుతూ.. 29 రోజుల కానుకలను లెక్కింపు చేయగా రూ.25,56,798 నగదు, బంగారం 18 గ్రాములు, వెండి 910 గ్రాములు, యూఎస్ఏ డాలర్లు 3, అన్నదాన హుండీ ద్వారా రూ.92,260 ఆదాయం వచ్చింది అన్నారు.
SKLM: వచ్చే నెల 11న కృష్ణా జిల్లా నూజివీడులో జరగబోయే రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు మార్చి 1న జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి ఎల్. చిట్టిబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అరసవల్లిలో గల ఆర్చరీ అకాడమీలో ఆర్చరీ పోటీలకు ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు.
CTR: కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హత కలిగిన 1,386 మంది రైతులందరికీ మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని సూచించారు. రైతులకు మైక్రో ఇరిగేషన్ పథకం ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
VSP: అనకాపల్లి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవాలయ భూములపై కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుదారి పట్టించేలా ఉందని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్నారు.
కర్నూలు: పట్టణంలోని ప్రధాన రహదారులు, ట్రాఫిక్ కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆధునిక మ్యాట్రిక్స్, ఏఐ సీసీ కెమెరాలు 24 గంటలపాటు నిఘా పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. 100 ఏఐ సీసీ కెమెరాలతో నగరంలోని ప్రధాన రహదారులు, ట్రాఫిక్ హబ్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
W.G: జిల్లా కలెక్టర్ శుక్రవారం భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వీఆర్వో, వీఆర్ఏల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. ఉద్యోగులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచిస్తూ.. చిన్న సమస్యలను కూడా పట్టించుకోకపోతే అవి పెద్ద వ్యాధులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
JGL: ప్రతి వాహనదారుడు ఇంట్లో నుంచి బయటికి వాహనంపై వెళ్తున్నారంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం పెగడపల్లి మండలం అయితుపల్లిలో రోడ్డు భద్రతపై ఎస్సై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు, ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని అన్నారు.
MBNR: రాజపూర్ మండలంలోని తిరుమలాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం ’స్వయం పరిపాలన’ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా బాధ్యతలు చేపట్టి పాఠాలు బోధించి మెప్పించారు. ఎంఈవో సుధాకర్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
SRD: కంగ్టి(మం) సుక్కలతీర్థ్ గ్రామాన్ని AEO సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు స్థానిక శివారులో రైతులు సాగు చేస్తున్న యాసంగి జొన్న పంట క్షేత్రంలో పంటను పరిశీలించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం, గాలులకు ఏపుగా పెరిగిన జొన్న పంట కొంత నేలకొరిగింది. అయితే నాలుగైదు మొక్కపైర్లకు ఒకచోట కట్టితే జొన్న పంట కాపాడుకోవచ్చని సూచించారు.
NLR: బుచ్చి పట్టణంలోని 20 వార్డులలో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో దోమలు విపరీతంగా పెరగడంతో తాము అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. దోమల నివారణకు అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సత్యసాయి: హిందూపురంలోని మూడో వార్డులలో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే 3వ వార్డులో సచివాలయం సందర్శించి, రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది విధులు నిర్వహణపై మాట్లాడారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అర్హులైన వారందరికీ అందేలా చూడాలన్నారు.
కాకినాడ: జిల్లాలో 48 మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన శోంటిని గంగాధర్‌ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం గౌరవ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరపరచగా ఒక్కో కేసుకు 2 సం.ల జైలుశిక్ష విధించారని తెలిపారు. అయితే ఈ వాహనాల కొన్న 6 మంది వ్యక్తులకు రూ. 3వేలు జరిమానా విధించారని సీఐ శ్రీనివాస్ తెలిపారు.